Telangana: తెలంగాణలో మందుబాబులకు పుల్ జోష్, డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్లు, ఈవెంట్స్, టూరిజం హోటల్స్‌లో మందు విక్రయాలకు ప్రభుత్వం అనుమతి
మద్యం దుకాణాల సమయాన్ని పొడిగిస్తున్నట్లు (Bars, liquor shops timings extended ) వెల్లడించింది. 2021, డిసెంబర్ 28వ తేదీ మంగళవారం టీఎస్ సర్కార్ ప్రత్యేక అనుమతులు జారీ చేసింది.
Hyd, Dec 28: కొత్త సంవత్సరం సమీపిస్తున్న మద్యం బాబులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మద్యం దుకాణాల సమయాన్ని పొడిగిస్తున్నట్లు (Bars, liquor shops timings extended ) వెల్లడించింది. 2021, డిసెంబర్ 28వ తేదీ మంగళవారం టీఎస్ సర్కార్ ప్రత్యేక అనుమతులు జారీ చేసింది.
మద్యం దుకాణాలు,. బార్లు, స్పెషల్ ఈవెంట్స్ కు (New Year’s eve in Telangana) ప్రత్యేక అనుమతులు ఇస్తున్నట్లు తెలిపింది. మద్యం షాపులు డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్లు, ఈవెంట్స్, టూరిజం హోటల్స్ కు రాత్రి 1 గంట వరకు విక్రయాలు జరుపుకోవడానికి అనుమతినివ్వడం జరుగుతుందని తెలిపింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం కరోనా..కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తున్న క్రమంలో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. తెలంగాణ రాష్ట్రం కూడా పలు నిబంధనలు విధించింది. హైకోర్టు ఆదేశాల మేరకు నూతన సంవత్సర వేడుకలపై కోవిడ్ ఆంక్షలు విధించింది. జనవరి 2వ తేదీ వరకు రాష్ట్రంలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధించింది. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ నిర్వహించుకునే సమావేశాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
జనసమ్మర్థం ఎక్కువగా ఉన్నచోట్ల థర్మల్ స్కానింగ్ ఏర్పాటు చేసి ఉష్ణోగ్రతలు పరిశీలించాలని చెప్పింది. ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్క్ ధరించాలని… భౌతిక దూరం కూడా తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది.