IPL Auction 2025 Live

Bayyaram Ukku-Telangana Hakku: బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఒక్క రోజు నిరసన చేపట్టిన టీఆర్ఎస్ నేతలు

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యంకాదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిథులు, నాయకులు ఖమ్మంలో ఒక్కరోజు దీక్ష (TRS leaders Protest) చేపట్టారు

Bayyaram Ukku-Telangana Hakku(Photo-Twitter)

Hyd, Feb 22: బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కోసం టీఆర్ఎస్ నేతలు బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు నినాదంతో నిరసన దీక్ష చేపట్టారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యంకాదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిథులు, నాయకులు ఖమ్మంలో ఒక్కరోజు దీక్ష (TRS leaders Protest) చేపట్టారు. ఈ దీక్షలో మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు హరిప్రియ నాయక్, శంకర్ నాయక్, రేగా కాంతారావు, రెడ్యానాయక్, ఎమ్మెల్సీ రవీందర్ రావు, జడ్పీ చైర్మన్ బిందు పాల్గొన్నారు. విభజన చట్టం ప్రకారం ఉక్కు పరిశ్రమను (steel plant) ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు దీక్ష కొనసాగనుంది.

బయ్యారం ఉక్కు పరిశ్రమ (Bayyaram Ukku-Telangana Hakku) కోసం పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీస్తామని లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సహాయమంత్రి నుంచి క్యాబినెట్‌ మంత్రిగా ఎదిగినా ఇంకా నిస్సహాయ మంత్రిగానే ఉన్నారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ఎద్దేవా చేశారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కిషన్‌రెడ్డి చెప్పింది సొంత అభిప్రాయమా? కేంద్ర ప్రభుత్వ విధానమా? అని నిలదీశారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత అన్నారు.

భద్రాచలం రాములోరి దర్శనం ఇకపై చాలా ఖరీదు, శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు టికెట్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన ఈవో శివాజీ

బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధ్యంకాదన్న కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఉక్కు పరిశ్రమ వస్తే ఉద్యోగాలు లభిస్తాయని స్థానిక గిరిజనులు, ఇతరులు ఆశగా ఎదురుచూశారని, వారి ఆశలపై కిషన్‌రెడ్డి నీల్లు చల్లారని మండిపడ్డారు. బయ్యారంలో నాణ్యమైన ఉక్కు లభిస్తుందని జీఎస్‌ఐ సర్వేచేసి తేలిస్తే, కిషన్‌రెడ్డి అందుకు విరుద్ధంగా మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. నాణ్యమైన ఐరన్‌ ఓర్‌ లేనప్పుడు కనీసం పెల్లెట్ల యూనిట్‌ అయినా ఏర్పాటు చేస్తామని గతంలో కేంద్ర మంత్రి బీరేందర్‌ సింగ్‌ తెలిపారని, అదీ అమలు కాలేదని విమర్శించారు.



సంబంధిత వార్తలు

KTR: రాహుల్ గాంధీ తిట్టడంతోనే వెనక్కి తగ్గిన రేవంత్ రెడ్డి...అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేటీఆర్ ఫైర్, చిట్టినాయుడు చిప్ దొబ్బిందని ఎద్దేవా చేసిన కేటీఆర్

Harishrao: వాంకిడి బాధితులను పరామర్శించడం తప్పా?, రాజ్యాంగ దినోత్సవం రోజే హక్కుల ఉల్లంఘనా?...సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్

TG Weather Update: తెలంగాణపై చలి-పులి పంజా.. అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపు రాత్రి ఉష్ణోగ్రతలు.. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (యూ)లో రికార్డు స్థాయిలో 8.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. రానున్న మూడ్రోజుల్లో ఇంకా పడిపోనున్న ఉష్ణోగ్రతలు

TG Weather Update: చలితో గజగజలాడుతున్న తెలంగాణ.. సంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 9 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిక