Bhadrachalam (Wikimedia Commons)

Bhadrachalam, Feb 23: తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం (Bhadrachalam) దేవస్థానంలో ఈ ఏడాది నిర్వహించే శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల టికెట్‌ ధరలను (vSri Rama Navami celebrations Tickets Price Hike ) పెంచుతున్నట్టు ఈవో శివాజీ తెలిపారు. మంగళవారం ఈవో మీడియాకు వివరాలు వెల్లడించారు. గతంలో రూ.5 వేలు ఉన్న సెక్టార్‌ 1B ఉభయదాతల టిక్కెట్‌ ధరను రూ.7,500, 1A టికెట్‌ ధరను రూ.2 వేల నుంచి రూ.2,500, 1C టికెట్‌ ధర రూ.1,116 నుంచి రూ.2 వేలకు పెంచినట్టు తెలిపారు. 1D, 1E, 1F టికెట్ల ధరలు రూ.500 నుంచి రూ.వెయ్యికి, 2A, 2B, 2C, 2D, 2E, 3A, 3B, 3C టికెట్ల ధరలు రూ.200 నుంచి రూ.300కు పెంచామన్నారు.

అదేవిధంగా 4A, 4B, 4C, 4D, 4E, 4E, 4F, 4G టికెట్ల ధర రూ.100 నుంచి రూ.150కు పెంచినట్టు వివరించారు. పట్టాభిషేకం టికెట్‌ ధర రూ.250 నుంచి వెయ్యికి మార్చినట్టు వెల్లడించారు. భక్తులు పోస్టల్‌ ద్వారా రూ.5 వేలు చెల్లిస్తే వారి గోత్ర నామాలతో అర్చన, శేష వస్త్రాలు, 5 ముత్యాలు గల తలంబ్రాల ప్యాకెట్‌, కుంకుమ, ప్రసాదం పోస్టు ద్వారా పంపిస్తామనిచెప్పారు. రూ.1100 చెల్లించిన భక్తులకు గోత్ర నామాలతో అర్చన, 2 ముత్యాలు గల తలంబ్రాల ప్యాకెట్‌, కుంకుమ, ప్రసాదాన్ని పంపుతామని వెల్లడించారు.