Telangana Assembly Sessions 2022: స్పీకర్‌ మరమనిషిలా పని చేస్తున్నారంటూ ఎమ్మెల్యే ఈటల వ్యాఖ్యలు, ఈ అసెంబ్లీ సెషన్ మొత్తం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈటలపై (BJP MLA Etela Rajender) స్పీకర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు

Etela Rajender (Photo-Twitter)

Hyd, Sep 13: తెలంగాణ అసెంబ్లీ మూడో రోజు సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను సభ నుంచి సస్పెండ్‌ (BJP MLA Etela Rajender suspended) చేస్తున్నట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈటలపై (BJP MLA Etela Rajender) స్పీకర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈటల క్షమాపణ చెప్పకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఈ సెషన్‌ మొత్తానికి సస్పెన్షన్‌ వర్తిస్తుందని స్పీకర్‌ ప్రకటించారు.

కాగా ఈటెల రాజేందర్ ‘‘నాకు మాట్లాడే అవకాశం ఇవ్వరా?.. బెదిరిస్తారా?’’ అంటూ వ్యాఖ్యానించారు.స్పీకర్‌ మరమనిషిలా పని చేస్తున్నారు. సభా సంప్రదాయాలను మర్చిపోతున్నారు. దీన్ని కాలరాసే అధికారం సీఎంకు లేదు. ఐదు నిమిషాలు సభ నడిపి ప్రజా సమస్యల నుంచి తప్పించుకున్నా ప్రజాక్షేత్రంలో తప్పించుకోబోరని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 80, 90 రోజులపాటు, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా 20 రోజులపాటు, వర్షాకాల సమావేశాలు నుంచి 20 రోజుల పాటు జరిగేవని, అలాంటప్పుడు కేవలం ఐదు నిమిషాలు, మూడు రోజుల పాటు జరగడం ఏంటని ఈటల, స్పీకర్‌ పోచారంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

వెంటనే విద్యుత్ సవరణ బిల్లు 2022 ఉపసంహరించుకోండి, లేకుంటే రైతులు మరో ఆందోళనకు పిలుపునివ్వక తప్పదు, కేంద్రంపై మండిపడ్డ సీఎం కేసీఆర్

అయితే స్పీకర్‌ మాత్రం సభ నుంచి బయటకు వెళ్లాలని ఈటలకు సూచించారు. ‘స్పీకర్‌పై ఈటల అమర్యాదపూర్వకంగా మాట్లాడారు. అనుచిత వ్యాఖ్యలపై ఈటల క్షమాపణ చెప్పలేదని.. సభ గౌరవాన్ని కాపాడేందుకు ఈటలపై చర్యలని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. ఈటల తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌ కోరారు.



సంబంధిత వార్తలు

BJP MP Purandeswari: అల్లు అర్జున్‌ని టార్గెట్ చేయడం సరికాదు, తొక్కిసలాట అనుకోకుండా జరిగిన సంఘటన..ఏ11గా ఉన్న బన్నీ అరెస్ట్ సరికాదన్న ఎంపీ పురందేశ్వరి

KTR On Rythu Bharosa: రుణమాఫీపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే క్లారిటీ లేదు, 100 శాతం రుణమాఫీ అయిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా...ప్రభుత్వానికి సవాల్ విసిరిన కేటీఆర్

Congress MLA Aadi Srinivas: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు, కేటీఆర్ అరెస్ట్ తర్వాత విధ్వంసానికి బీఆర్ఎస్ కుట్ర...రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు ప్లాన్ చేశారని కామెంట్

Telangana Assembly Sessions: అసెంబ్లీని కుదిపేసిన ఫార్ములా ఈ కార్ రేసు అంశం, కేటీఆర్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్, కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో కుదరదన్న ప్రభుత్వం

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif