Bandi Sanjay on New Secretariat: ప్రగతిభవన్‌ను ప్రజా దర్బార్‌గా మారుస్తాం, కొత్త సచివాలయంలో డోమ్‌లు కూల్చివేసి తెలంగాణ సంస్కృతికి పట్టం కడతాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
కొత్త సచివాలయంలో మార్పులు చేస్తాము. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా మారుస్తాము.
Hyd, Feb 10: బీజేపీ అధికారంలోకి రాగానే కొత్త సచివాలయం డోమ్‌లు కూల్చివేస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త సచివాలయంలో మార్పులు చేస్తాము. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా మారుస్తాము. బీజేపీ అధికారంలోకి రాగానే కొత్త సచివాలయం డోమ్‌లు కూల్చివేస్తామన్నారు. ప్రగతిభవన్‌ను కూడా ప్రజా దర్బార్‌గా మారుస్తామని కామెంట్స్ చేశారు.
ఈ క్రమంలోనే కేటీఆర్‌కు బండి సంజయ్ సవాల్ విసిరారు. రోడ్లకు అడ్డంగా ఉన్న గుళ్లు, మసీదులు కూల్చేస్తామని కేటీఆర్ చెబుతున్నారు. దమ్ముంటే పాతబస్తీ నుంచే ఇది మొదలుపెట్టాలి. కేసీఆర్ తెలంగాణను ఎంఐఎంకి కట్టబెట్టాలని చూస్తున్నారు. బీఆర్‌ఎస్, ఎంఐఎం రెండూ ఒక్కటే. బీఆర్‌ఎస్, ఎంఐఎం కలిసి పోటీచేస్తే డిపాజిట్లు కూడా రాకుండా చేస్తాము.
పెళ్లిళ్ల సీజన్‌కు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక రాయితీ.. జూన్ 30 వరకు 10 శాతం డిస్కౌంట్ వర్తింపు
తెలంగాణలో నిజాం రాజ్యం పోవాలి. మన రాజ్యం రావాలి. కరెంట్ ఇవ్వడం లేదు. పొలాలు ఎండిపోతున్నాయి. రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాతబస్తీలో యువతకు ఎందుకు ఉద్యోగాలు, పాస్‌పోర్టులు ఎందుకు రావడంలేదో ఎంఐఎం నేతలు, పాతబస్తీలు ఆలోచించుకోవాలి. దేశంలో ఎక్కడ ఎలాంటి ఘటనా జరిగినా పాతబస్తీకి చెందిన వ్యక్తులే ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు.