Medigadda Barrage: మేడిగ‌డ్డ రిపేర్ ప‌నుల‌కు బ్రేక్, ఇప్పట్లో ప‌నులు చేప‌ట్టే ప‌రిస్థితి లేదంటున్న అధికారులు

ఎగువున భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర నుంచి వస్తున్న వరద నీరు.. ప్రాణహిత నదికి భారీగా చేరుకుంది. ప్రాణహితలో వరద ప్రవాహం పెరిగి.. ఆ వరద మేడిగడ్డ బ్యారేజీకి (Medigadda Barrage) రావడంతో.. బ్యారేజీ మరమ్మతు పనులు కొనసాగించే పరిస్థితులు లేకుండా పోయాయి.

Medigadda Project (Photo-X/TS Congress)

Hyderabad, June 28: మేడిగడ్డ బ్యారేజ్ (Medigadda Barrage) మరమ్మతు పనులకు బ్రేక్ పడింది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహితలో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో మరమ్మతు పనులను నిలిపివేసిన అధికారులు.. మొత్తం 85 గేట్లకు గాను 84 గేట్లను తెరిచారు. మేడిగడ్డకు ఎగువ నుంచి 10వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. వర్షా కాలం తర్వాతే బ్యారేజ్ మరమ్మతు పనులు పున: ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎగువున భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర నుంచి వస్తున్న వరద నీరు.. ప్రాణహిత నదికి భారీగా చేరుకుంది. ప్రాణహితలో వరద ప్రవాహం పెరిగి.. ఆ వరద మేడిగడ్డ బ్యారేజీకి (Medigadda Barrage) రావడంతో.. బ్యారేజీ మరమ్మతు పనులు కొనసాగించే పరిస్థితులు లేకుండా పోయాయి. ప్రస్తుతం తాత్కాలికంగా మరమ్మతు పనులకు బ్రేక్ పడింది. రోజురోజుకి వరద ప్రవాహం పెరుగుతోంది. ఈ కారణంగా.. ఎగువున, దిగువున పనులు నిర్వహించే పరిస్థితులు లేవు. అన్ని గేట్ల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. దాంతో మరమ్మతులు ఇక కొనసాగించలేము అనే నిర్ధారణకు అధికారులు వచ్చారు.

Telangana: వీడియో ఇదిగో, కరెంట్ షార్ట్ సర్క్యూట్‌తో పూర్తిగా కాలి బూడిదైన రైతు కూలీ ఇల్లు, సుమారు రూ. 5 లక్షల ఆస్తి నష్టం 

ప్రస్తుతం యంత్రాలు అన్నింటిని బ్యారేజీ నుంచి బయటకు తీసుకొస్తున్నారు. బ్యారేజీలో 85 గేట్లు ఉండగా అందులో 84 గేట్లను పూర్తి స్థాయిలో లిఫ్ట్ చేశారు. 7వ బ్లాక్ లో 20వ గేటు మొరాయించడంతో గ్యాస్ కట్టర్ సాయంతో కట్ చేసి అందులోని భాగాలను విడదీశారు. 7వ బ్లాక్ లో ఉన్న అన్ని గేట్ల ద్వారా నీరు వెళ్లిపోయే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రాణహిత నదితో పాటు గోదావరి పరివాహక ప్రాంతంలోనూ వర్షాలు కురుస్తుండటంతో రోజురోజుకి వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతానికి మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లైంది.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు