Padi Kaushik Reddy Gets Bail: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్.. రెండు షూరిటీల‌తో పాటు రూ. 5 వేల జ‌రిమానాతో బెయిల్ మంజూరు చేసిన న్యాయ‌మూర్తి

సీఐ రాఘ‌వేంద్ర ఫిర్యాదు మేర‌కు బంజారాహిల్స్ పీఎస్‌ లో కౌశిక్ రెడ్డిపై కేసు న‌మోదైంది.

MLA Padi Kaushik Reddy (Photo-X)

Hyderabad, Dec 6: పోలీసుల విధులకు (Police Duty) ఆటంకం కలిగించినందుకు అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి (Bail for Padi Kaushik Reddy) గురువారం రాత్రి బెయిల్ మంజూరు అయింది. సీఐ రాఘ‌వేంద్ర ఫిర్యాదు మేర‌కు బంజారాహిల్స్ పీఎస్‌ లో కౌశిక్ రెడ్డిపై కేసు న‌మోదైంది. దీంతో గురువారం ఉద‌యం కొండాపూర్‌ లోని కౌశిక్ రెడ్డి ఇంటికెళ్లి పోలీసులు ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం ఆయ‌న‌ను బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్‌ కు త‌ర‌లించారు. రాత్రి జ‌డ్జి ముందు హాజ‌రుప‌రిచారు. విచార‌ణ అనంత‌రం పాడి కౌశిక్ రెడ్డికి న్యాయ‌మూర్తి రెండు షూరిటీల‌తో పాటు రూ. 5 వేల జ‌రిమానాతో బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అల్లు అర్జున్ పై కేసు న‌మోదు, మ‌హిళ మృతిపై నిర్ల‌క్ష్యం విష‌యంలో పోలీసుల సీరియస్ యాక్ష‌న్

అరెస్టు ఎందుకు?

సీఎం రేవంత్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ శివ‌ధ‌ర్ రెడ్డి త‌న ఫోన్‌ ను ట్యాప్ చేస్తున్నారంటూ కౌశిక్ రెడ్డి బుధ‌వారం బంజారాహిల్స్ పీఎస్‌ కు వెళ్లి హంగామా చేశారు. ఈ నేప‌థ్యంలో తమ విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయ‌న‌ పై సీఐ రాఘ‌వేంద్ర ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు అయింది. ఆ త‌ర్వాత గురువారం ఆయ‌న‌ను అరెస్ట్ చేశారు.

మహిళ మృతిపై స్పందించిన మైత్రీ మూవీ మేకర్స్, బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని వెల్లడించిన మేకర్స్