Telangana Runamafi: మీకు రుణమాఫీ కాలేదా, అయితే మీకోసమే బీఆర్ఎస్ టోల్ ఫ్రీ నెంబర్, రైతులందరికీ రుణమాఫీ అయ్యే వరకు నిద్రపోనివ్వంటున్న గులాబీ నేతలు
తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన నిరంజన్ రెడ్డి....కేసీఆర్ రైతులకు ఉచిత విద్యుత్ పెట్టుబడి సాయం ఇచ్చి సంపూర్ణ రక్షణ వలయం ఏర్పాటు చేశారు...వ్యవసాయ శాస్త్రవేత్త దివంగత స్వామి నాథన్ సైతం కేసీఆర్ తీసుకున్న చర్యలను మెచ్చుకున్నారు అన్నారు.
Hyd, Aug 5: తెలంగాణ రాష్ట్రం లో రైతులు గౌరవంగా బతకగలమని గుండె మీద చేయి వేసుకుని చెప్పేలా కేసీఆర్ అన్ని చర్యలు తీసుకున్నారన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన నిరంజన్ రెడ్డి....కేసీఆర్ రైతులకు ఉచిత విద్యుత్ పెట్టుబడి సాయం ఇచ్చి సంపూర్ణ రక్షణ వలయం ఏర్పాటు చేశారు...వ్యవసాయ శాస్త్రవేత్త దివంగత స్వామి నాథన్ సైతం కేసీఆర్ తీసుకున్న చర్యలను మెచ్చుకున్నారు అన్నారు.
రైతు బంధు సాయం తో పాటు కేసీఆర్ రెండు విడతలుగా రైతు రుణమాఫీ చేశారని....రెండు లక్షల రుణ మాఫీని డిసెంబర్ 9 నే పూర్తి చేస్తామని ఎన్నికలప్పుడు కాంగ్రెస్ ప్రగల్భాలు పలికిందన్నారు. తర్వాత మార్చి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం జూలై లో రుణ మాఫీ మొదలు పెట్టిందని......లక్ష లోపు రుణ మాఫీకి ప్రభుత్వం కేటాయించిన మొత్తం 6 వేల కోట్ల రూపాయలు మాత్రమే అన్నారు. లక్షన్నర లోపు రుణాలకు ప్రభుత్వం కేటాయించింది 12 వేల కోట్ల రూపాయలు మాత్రమే
..రైతు భరోసా అమలు చేస్తే 30 వేల కోట్ల రూపాయలు అవుతుందని, రైతు బంధు ,రైతు భరోసా ఎగ్గొట్టారు అన్నారు. అర్హులై రుణమాఫీ జరగని రైతులకు బీఆర్ఎస్ టెక్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ – 8374852619 ఏర్పాటు చేశామన్నారు.
కేసీఆర్ రైతు బంధు కింద ఒక విడత కు ఇచ్చిన మొత్తం 7300 కోట్ల రూపాయలు ,మేము రుణమాఫీ చేసినపుడు ఇప్పటిలాగా పేపర్లలో advertisement లు ఇచ్చుకోలేదు ..ఒక్కో విడతకు పేపర్ ప్రకటనల కోసం రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారు అన్నారు. కేసీఆర్ ఇలాంటి ప్రకటనలకు అపుడు దూరంగా ఉన్నారు
..రైతుల సంబరాలు ఎక్కడ ?బ్యాంకుల దగ్గర రైతులు ఆందోళనలు చేస్తున్నారు అన్నారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో బీఆర్ఎస్ న్యాయపోరాటం, రాజ్యాంగ నిపుణులతో సంప్రదింపులు, త్వరలో ఉప ఎన్నిక ఖాయమన్న కేటీఆర్
చిన్న చిన్న సాకులతో రైతు రుణ మాఫీని ఎగ్గొడుతున్నారు
...గ్రామాల్లో లక్ష లోపు రుణ మాఫీ కాని వారు చాలా మంది ఉన్నారు అన్నారు. .రైతు భరోసా నే కాదు ..ఎవ్వరికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లో భరోసా లేదు
..రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టిన ప్రభుత్వం దేశం లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే అన్నారు. కేబినేట్ సబ్ కమిటీ రిపోర్టు ఏమైంది ?
..కేసీఆర్ హయం లో ఇచ్చినట్టే రైతు బంధు పై ఎలాంటి ఆంక్షలు ఇవ్వకుండా అమలు చేయాలన్నారు.