BRS Party Formation Day: వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తాం , బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంలో సీఎం కేసీఆర్, బాగా పనిచేసిన వారికే ఈసారి టికెట్లు అని స్పష్టం

దాదాపు ఏడుగంటలపాటు ఈ సమావేశం (BRS Party Formation Day) కొనసాగింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.

CM KCR (Photo-Twitter/TS CMO)

Hyd, April 27: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ భవన్‌లో గురువారం పార్టీ ఆవిర్భావ వేడుకలతోపాటు సర్వసభ్య సమావేశం జరిగింది. దాదాపు ఏడుగంటలపాటు ఈ సమావేశం (BRS Party Formation Day) కొనసాగింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.దళితబంధు పథకంలో డబ్బులు వసూలు చేసే ఎమ్మెల్యేల చిట్టా నా దగ్గర ఉంది. ఆ ఎమ్మెల్యేలకు ఇదే చివరి వార్నింగ్‌. ఇంకోసారి తప్పు చేస్తే పార్టీ నుంచి తప్పిస్తాం. అనుచరులు డబ్బులు తీసుకున్నా ఎమ్మెల్యేలదే బాధ్యత. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల విషయంలోనూ ఆరోపణలు ఉన్నాయి’’ అని సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మే రెండో వారంలో తెలంగాణ ఇంటర్ ఫలితాలు, ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా రిజల్ట్స్ విడుదల చేయాలని కసరత్తు చేస్తున్న ఇంటర్‌ బోర్డు

వ్యక్తిగత ప్రతిష్ఠకు పోకుండా పార్టీ కోసం కలిసి పనిచేయాలని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, సీనియర్‌ నేత కడియం శ్రీహరికి సూచించారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని స్పష్టం చేశారు. నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవద్దని సూచించారు. ఎలాంటి సమస్య ఉన్న అధిష్ఠానంతో చెప్పాలన్నారు. ఎన్నికలే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని ఆదేశించారు.ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పని చేసుకోవాలన్నారు. లేకుంటే నష్టపోతారని, సరిగా పని చేయని ఎమ్మెల్యేల తోక కత్తిరిస్తామని హెచ్చరించారు.

చేప ప్రసాదం పంపిణీ మళ్లీ ప్రారంభం, జూన్‌ 9 ఉదయం 8 గంటల నుంచి జూన్‌ 10వ తేదీ ఉదయం 8 గంటల వరకు ఉచితంగా పంపిణీ

ఎన్నికలపై సీఎం కేసీఆర్ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తూనే.. నేతలకు క్లాస్‌ పీకారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేయాలని పేర్కొన్నారు. బాగా పనిచేసిన వారికే ఈసారి టికెట్లు దక్కుతాయని తేల్చి చెప్పారు. నియోజవర్గంలో టికెట్ల పంచాయతీ ఎందుకు వస్తుందని.. టికెట్లు ఎవరికి ఇవ్వాలో తనకు తెలుసని అన్నారు. పార్టీలో గ్రూప్‌ తగాదాలను పరిష్కరింగే బాధ్యత మంత్రులదేనని స్పష్టం చేశారు.

పని తీరు సరిగా లేని ఎమ్మెల్యే జాబితా తన వద్ద ఉందన్నారు సీఎం కేసీఆర్‌. కానీ ఇప్పుడు వారి పేర్లను బహిర్గతం చేయదలచలేదన్నారు.. సమయం వచ్చినప్పుడు అన్ని చెబుతానని, అంతా బాగానే ఉన్న వ్యక్తిగత కారణాలతో కొంతమంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఇది చాలా క్లిష్టమైన సమయమన్న సీఎం కేసీఆర్‌.. మీరు పనులతో సంతృప్తి పరచకపోతే చేసేదేమి లేదన్నారు. అదే విధంగా డబుల్‌బెడ్‌ రూం, దళితబంధులో అవినీతి జరుగుతుందంటూ కేసీఆర్‌ సీరియస్‌ వ్యాఖ్యలు చేశారు.