BRS Interest Subvention Scheme: ఇంటి రుణగ్రస్తులకు శుభవార్త.. హోమ్ లోన్ పై వడ్డీని కట్టే స్కీంను యోచిస్తున్నాం.. మంత్రి కేటీఆర్ వెల్లడి
హోమ్ లోన్ తో ఇల్లు కొనుక్కునే వారి కోసం ఈ స్కీం తీసుకొస్తున్నట్టు తెలుస్తున్నది.
Hyderabad, Nov 25: ఎన్నికల నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ (BRS) మరో కొత్త స్కీంకు (New Scheme) తలుపులు తెరిచింది. హోమ్ లోన్ తో ఇల్లు కొనుక్కునే వారి కోసం ఈ స్కీం (BRS Interest Subvention Scheme) తీసుకొస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వెల్లడించారు. తొమ్మిదిన్నరేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో విద్యుత్తు, సాగు, తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించామని ఆయన తెలిపారు. వచ్చే టర్మ్ లో రెండు అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో పక్కా ఇల్లు లేని కుటుంబం ఉండకూడదని, ప్రతి ఒక్క కుటుంబానికి సొంత ఇల్లు కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
హౌజ్ ఫర్ ఆల్
హౌజ్ ఫర్ ఆల్ లక్ష్యంగా గృహలక్ష్మి, డబుల్ బెడ్ రూంతోపా టు హోమ్ లోన్ తో ఇల్లు కొనుక్కునే వారి కోసం కొత్త స్కీం తీసుకొస్తామని, వడ్డీ భారం ప్రభుత్వమే భరిస్తుందని కేటీఆర్ తెలిపారు.