Hyderabad, Nov 25: బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన అల్పపీడనంతో రానున్న 3-4 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rains) కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొన్నది. తెలంగాణ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) గణాంకాల ప్రకారం.. గురువారం సాయంత్రం 7 గంటల వరకు చాంద్రాయణగుట్టలో 6.8 మి.మీ, రాజేంద్రగనగర్‌లో 5.5, నగరంలో మిగిలిన ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ జిల్లాలో 4.8 సెం.మీ, యాదాద్రిలో 3.9 సెం.మీ వర్షపాతం నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి. ఐఎండీ (IMD) కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలో తగ్గుదలని అంచనా వేసింది. దీని ప్రకారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉంది.
తెలంగాణలో వచ్చే 4 రోజులు మోస్తరు వర్షాలు.. ఆ జిల్లాలకు హైఅలెర్ట్.!#Hyderabad | #RainAlert | #TelanganaNewshttps://t.co/QYlbwNe87p
— TV9 Telugu (@TV9Telugu) November 24, 2023
ఈ జిల్లాలకు అలర్ట్
రాబోయే 3-4 రోజుల్లో తెలంగాణలోని సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.