Car Accident: బ్రేకులకు బదులు యాక్సిలరేటర్ తొక్కాడు.. అంతే.. చెరువులోకి దూసుకెళ్లిన కారు.. జనగామలో ఘటన (వీడియో)

మాస్టర్ సరిగానే డ్రైవింగ్ సూచనలు ఇస్తున్నాడు. ఇంతలో ఓ చెరువు వచ్చింది. బ్రేకులు వెయ్యాలని స్టూడెంట్ కు మాస్టర్ ఆర్డర్ చేశాడు.

car plunged into the pond (Credits: X)

Jangaon, Oct 19: అతను కారు డ్రైవింగ్ (Car Driving) నేర్చుకుంటున్నాడు. మాస్టర్ సరిగానే డ్రైవింగ్ సూచనలు ఇస్తున్నాడు. ఇంతలో ఓ చెరువు వచ్చింది. బ్రేకులు వెయ్యాలని స్టూడెంట్ కు మాస్టర్ ఆర్డర్ చేశాడు. అయితే, బ్రేకు బదులు యాక్సిలరేటర్ తొక్కాడు ఆ స్టూడెంట్. ఇంకేముంది? చక్కగా ఆ కారు చెరువులోకి (car plunged into the pond) దూసుకెళ్లింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన జనగామలోని (Jangaon) స్థానిక బతుకమ్మ కుంటలో జరిగింది. అయితే, స్థానికంగా ఉన్న మరో వ్యక్తి అప్రమత్తం అవ్వడంతో పెద్ద గండం తప్పినట్లయింది.

హైదరాబాద్ ప్రజాభవన్ ముందు కారు బీభత్సం.. అతివేగంగా వచ్చి రోడ్డుపై పల్టీ కొట్టిన కారు.. యువకులకు గాయాలు (వీడియో)

Here's Video:

అలా జరిగింది

జనగామలోని స్థానిక బతుకమ్మ కుంట పక్కన ఉన్న గ్రౌండ్ లో స్టూడెంట్ అయిన ఓ వ్యక్తికి మరో వ్యక్తి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్నాడు. ఈ క్రమంలో చెరువు గట్టు వరకు కారు వెళ్లింది. దీంతో కారు బ్రేకులు వెయ్యాలని మాస్టర్ అన్నాడు. ఐతే, అయోమయానికి గురై బ్రేకు బదులు యాక్సిలరేటర్ తొక్కాడు ఆ స్టూడెంట్. అలా కారు నేరుగా చెరువులోకి దూసుకెళ్లింది. వారిద్దరూ వెంటనే కారులోంచి చెరువులోకి దూకి స్థానికుడి సాయంతో ప్రమాదం నుండి బయట పడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

తెలంగాణ‌కు చెందిన ఓ ఎమ్మెల్యేకు అర్ధ‌రాత్రి నగ్నంగా ఉన్న మహిళ నుంచి వీడియో కాల్‌.. కంగుతిన్న ఎమ్మెల్యే.. పోలీసుల‌కు ఫిర్యాదు



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif