Hyderabad, Oct 19: అతనో ఎమ్మెల్యే (MLA). ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఎప్పటిలాగే ఈ నెల 14న అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రకు ఉపక్రమించారు. ఇంతలో తన మొబైల్ కు ఓ వీడియో కాల్ (Nude Video Call) వచ్చింది. ఏంటా? అని ఆరా తీయడానికి ఫోన్ లిఫ్ట్ చేశాడు ఆ ప్రజాప్రతినిధి. అంతే.. షాక్.. ఫోన్ తెరపై ఓ మహిళ నగ్నంగా కనిపించడంతోఆ ఎమ్మెల్యే షాకయ్యారు. వెంటనే కాల్ కట్ చేసేశారు. ఎవరైనా తనను ఇరికించడానికి ఇలా న్యూడ్ కాల్ చేశారా? లేక నిజంగానే గుర్తుతెలియని వ్యక్తులే చేసి ఉంటారా? అనే అనుమానం ఆ ఎమ్మెల్యేకు కలిగింది.
కేసు నమోదు
దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ కు ఫిర్యాదు చేశారు. అలాగే గురువారం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) లో కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.