HYDRA Ranganath: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ పై హెచ్ ఆర్సీలో కేసు.. 'హైడ్రా' కూల్చివేత‌ల భ‌యంతో కూక‌ట్‌ ప‌ల్లిలో వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో కేసు

అయితే, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ పై హెచ్ ఆర్సీలో కేసు నమోదైంది.

AV Ranganath (Credits: X)

Hyderabad, Sep 29: సహజ నీటి వనరులను అక్రమంగా చెరపట్టిన అక్రమార్కులపై పంజా విసురుతూ హైద‌రాబాద్ (Hyderabad) న‌గ‌ర వ్యాప్తంగా అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ హైడ్రా (HYDRA) ఈమధ్య తరుచూ వార్తల్లో నిలుస్తున్నది. అయితే, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ పై హెచ్ ఆర్సీలో కేసు నమోదైంది. కూకట్‌ పల్లిలో బుచ్చమ్మ అనే వృద్ధురాలు హైడ్రా తమ ఇళ్లను కూలుస్తుందనే భయంతో శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుందంటూ ఆమె కుటుంబ సభ్యులు మానవ హక్కుల కమిషన్‌ లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగనాథ్‌ పై హెచ్ఆర్సీ కేసు నమోదు చేసింది. హైడ్రా కూల్చివేతల వల్లే తమ తల్లి బలవన్మరణానికి పాల్పడిందని బుచ్చమ్మ కుమార్తెలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 16063/IN/2024 కింద కేసు నమోదు చేసినట్లు, విచారణ చేపట్టనున్నట్లు మానవ హక్కుల కమిషన్ తెలిపింది.

ఆంధ్రా నుండి వచ్చి పదేళ్ల క్రితం ఇల్లు కట్టుకున్నాం, ఇప్పుడు కూల్చేస్తామంటున్నారు..హరీశ్‌ రావుతో బాధితురాలు మొర.. వీడియో

అసలేం జరిగింది?

శివ‌య్య‌, బుచ్చ‌మ్మ దంప‌తులు త‌మ ముగ్గురు కూతుళ్ల‌కు పెళ్లిళ్లు చేసి, క‌ట్నంగా కూక‌ట్‌ ప‌ల్లి ప‌రిధిలోని యాద‌వ బ‌స్తీలో ఉన్న త‌లో ఇల్లును రాసిచ్చారు. అయితే, చెరువుల ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో నిర్మించిన ఇళ్ల‌ను హైడ్రా కూల్చివేస్తోంది. ఈ విష‌యం తెలిసి త‌మ బిడ్డ‌ల‌కు ఇచ్చిన ఇళ్లు కూల్చివేస్తార‌నే మ‌న‌స్తాపంతో త‌ల్లి బుచ్చ‌మ్మ ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు స‌మాచారం. దీనిపై మీడియా హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ ను ప్రశ్నించింది.

'హైడ్రా' కూల్చివేత‌ల భ‌యంతో కూక‌ట్‌ ప‌ల్లిలో మ‌హిళ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం.. ఈ ఘ‌ట‌న‌తో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేద‌న్న క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్

స్పందించిన‌ 'హైడ్రా' క‌మిష‌న‌ర్..

ఈ ఘ‌ట‌న‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ స్పందించారు. బుచ్చ‌మ్మ బ‌ల‌వ‌న్మ‌ర‌ణంపై కూక‌ట్‌ ప‌ల్లి పోలీసుల‌తో మాట్లాడిన‌ట్లు తెలిపారు. హైడ్రా కూల్చివేత‌ల్లో భాగంగా త‌మ ఇళ్ల‌ను కూలుస్తార‌నే భ‌యంతో వారి కూతుర్లు ఆమెను ప్ర‌శ్నించారు. దాంతో బుచ్చ‌మ్మ మ‌న‌స్తాపానికి గురై ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌తో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదు అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif