HYDRA Complaints: అక్రమ నిర్మాణాలకు సంబంధించి ప్రతి సోమవారం ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు ఫిర్యాదులు స్వీకరిస్తాం... అక్రమాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్
జీహెచ్ఎంసీ పరిధిలో ఓఆర్ఆర్ లోపల అక్రమ నిర్మాణాలకు సంబంధించి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రతి సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు.
Hyderabad, Jan 5: జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో ఓఆర్ఆర్ లోపల అక్రమ నిర్మాణాలకు సంబంధించి హైడ్రా (HYDRA) కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రతి సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు. హైదరాబాద్ లోని హైడ్రా కార్యాలయం ఉన్న బుద్ధ భవన్ లో ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, ఆ తర్వాత 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు తెలిపారు. అయితే ఫిర్యాదు చేసే ముందు పూర్తి ఆధారాలు, వివరాలతో ఫిర్యాదుదారుడు రావాలని సూచించారు. ఈ విషయంలో అనుమానాలు ఉంటే హైడ్రా కార్యాలయాన్ని సంప్రదించవచ్చని చెప్పారు.
ఈ నంబర్లలో సంప్రదించవచ్చు
040-29565758, 040-29560596 నెంబర్లకు ఫోన్ చేసి కూడా అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. ప్రాధాన్యతా క్రమంలో సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు.
(The above story first appeared on LatestLY on Jan 05, 2025 06:19 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

