Case Filed On Tollywood Producer: కెమెరామెన్ ను పెళ్లిపేరుతో మోసం చేసిన టాలీవుడ్ మహిళా నిర్మాత, ఇప్పటికే 2 పెళ్లీళ్లు చేసుకున్న కిలాడీ, తీసుకున్న డబ్బులు అడిగినందుకు రివర్స్ లో కేసు
అప్పటికే రెండు పెండ్లిళ్లు అయ్యి.. ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ.. ఆ విషయం దాచి.. తనను పెండ్లి చేసుకుందని అసిస్టెంట్ కెమెరామ్యాన్ నాగార్జున జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు..
Hyderabad, FEB 08: పెండ్లి పేరుతో మోసం చేసిందని టాలీవుడ్ మహిళా నిర్మాతపై (Tollywood Producer) ఓ బాధితుడు కేసు పెట్టాడు. అప్పటికే రెండు పెండ్లిళ్లు అయ్యి.. ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ.. ఆ విషయం దాచి.. తనను పెండ్లి చేసుకుందని అసిస్టెంట్ కెమెరామ్యాన్ నాగార్జున జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. పెండ్లి తర్వాత తన దగ్గర నుంచి రూ.18లక్షలు తీసుకుని.. అడిగితే బెదిరింపులకు పాల్పడిందని పేర్కొన్నాడు. వివరాల్లోకి వెళ్తే.. వెంకటగిరిలో నివసించే పుల్లంశెట్టి నాగార్జున అసిస్టెంట్ కెమెరామ్యాన్‌గా పనిచేస్తున్నాడు. భైరవపురం చిత్ర నిర్మాణ సమయంలో అతనికి ప్రొడ్యూసర్ ఆశ మల్లికతో (Asha Mallika) పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ముదిరిన తర్వాత తనను పెండ్లి చేసుకోవాలని నాగార్జునను ఆశ మల్లిక కోరింది.
తనకు అప్పటికే పెండ్లి అయ్యిందని.. భర్తకు విడాకులు ఇస్తానని ఒప్పించి.. చిలుకూరు బాలాజీ ఆలయంలో నాగార్జునను వివాహం చేసుకుంది. ఆ తర్వాత కొద్దిరోజులకు డబ్బులు అవసరం ఉన్నాయని నాగార్జున నుంచి రూ.18.50 లక్షలు తీసుకుంది. ఆ తర్వాత ఎంత అడిగినా ఆశ మల్లిక డబ్బు తిరిగి ఇవ్వలేదు. పైగా బెదిరింపులకు దిగి రివర్స్‌లో నాగార్జునపైనే కూకట్‌పల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఆశ మల్లిక ప్రవర్తనపై అనుమానం వచ్చిన నాగార్జున ఆమె గురించి విచారించగా చాలా విషయాలు తెలిశాయి. ఆశ మల్లికకు అప్పటికే రెండు పెండ్లిళ్లు అయ్యాయయని.. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది.
దీంతో బాధితుడు నాగార్జున జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు ఒక్కసారి వివాహమయ్యిందని.. పిల్లలు లేరని ఆశమల్లిక అబద్ధం చెప్పిందని కూడా చెప్పాడు. కాగా, అప్పటికే రెండు పెండ్లిళ్లు చేసుకున్న ఆశమల్లిక 2016లో గాజువాక పోలీస్ స్టేషన్‌లో మొదటి భర్త భరత్‌పై.. 2019లో కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో రెండో భర్త శ్రీనివాస్‌పై ఫిర్యాదులు చేసిందని పోలీసుల విచారణలో తెలిసింది. నకిలీ ఐడీ కార్డులతో మోసాలకు పాల్పడి.. వాళ్ల ఆస్తిలో వాటా కొట్టేస్తున్నట్లుగా కూడా వెల్లడైంది.