Dry Days in 2024: ఈరోజుల్లో వేడుక చిన్నదైనా, పెద్దదైనా మద్యం ఏరులై పారాల్సిందే. నేడు మందులేని విందు ఉండదు, అల్కాహాల్ లో తడిసిముద్దవనిదే ఏ వేడుకలో కిక్ ఉండదు అనే ధోరణి కొనసాగుతుంది. అందుకు మందు బాబులు కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనైనా మద్యానికి దూరంగా ఉంచేందుకు డ్రై-డేగా పాటిస్తున్నారు. భారతదేశంలో డ్రై డే అనేది మద్యం అమ్మకాలు పూర్తిగా నిషేధించబడిన లేదా పరిమితం చేయబడిన నిర్దిష్ట రోజులను సూచిస్తుంది.
జాతీయ సెలవులు, మతపరమైన లేదా సాంస్కృతిక ఉత్సవాలు లేదా పండగ సందర్భాలలో ప్రభుత్వం డ్రైడేను అమలు చేస్తుంది. ఎన్నికలు వంటి ప్రత్యేక సందర్భాల్లో కూడా డ్రైడేను అమలు చేస్తారు. అయితే ఈ డ్రైడేలు వివిధ రాష్ట్రాలలో జరిపే ఉత్సవాలను బట్టి కూడా అమలుచేయవచ్చు. డ్రై డేలను అమలు చేయడం వెనుక ఉన్న అసలు కారణం ఆరోజుకు ఉన్న ప్రాముఖ్యతను గౌరవించడం, మంచి స్పృహలో ఆ ప్రత్యేకమైన రోజును పాటించడం, ప్రభుత్వ నిబంధనలను పాటించడం. డ్రైడే అనేది కేవలం ప్రభుత్వం మాత్రమే విధించేది అని అనుకోకుండా వివిధ పండగల పవిత్రతను కాపాడటం, భక్తిభావంతో ఉండటం, వ్యక్తిగత భద్రత కోసం వ్యక్తులు తమకు తాముగా కూడా కొన్ని ఆంక్షలు విధించుకోవాల్సిన అవసరం ఉందని గ్రహించాలి.
ఈ ఏడాదిలో ఏదైనా స్నేహితులతో పార్టీ లేదా బంధువులతో గెట్-టుగెదర్ ప్లాన్ చేస్తుంటే, మీరు డ్రైడేగా పాటించాల్సిన రోజులను ఇక్కడ తెలియజేన్నాము. ఈ నిర్ధిష్టమైన తేదీలలో ఆల్కాహాల్ వినియోగం లేకుండా మీరు వేడుకలు నిర్వహించుకోవాలి లేదా మరోరోజు మీరు పార్టీని ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి రాబోయే నెలల్లో డ్రైడే తేదీల సమాచారం ఈ కింద చూడండి.
2024లో భారతదేశంలో డ్రై డేస్ జాబితా
ఫిబ్రవరి 19 సోమవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి (మహారాష్ట్రలో మాత్రమే)
మార్చి 5 మంగళవారం స్వామి దయానంద్ సరస్వతి జయంతి
మార్చి 8 శుక్రవారం శివరాత్రి
మార్చి 25 సోమవారం హోలీ
మార్చి 29 శుక్రవారం గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 10 బుధవారం ఈద్ ఉల్-ఫితర్
ఏప్రిల్ 14 శనివారం అంబేద్కర్ జయంతి
ఏప్రిల్ 17 బుధవారం శ్రీరామ నవమి
ఏప్రిల్ 21 ఆదివారం మహావీర్ జయంతి
మే 1 సోమవారం మహారాష్ట్ర దినోత్సవం (మహారాష్ట్రలో మాత్రమే)
జూలై 17 బుధవారం ముహర్రం మరియు ఆషాఢ ఏకాదశి
జూలై 21 ఆదివారం గురు పూర్ణిమ
ఆగస్టు 15 బుధవారం స్వాతంత్య్ర దినోత్సవం
ఆగస్టు 26 సోమవారం జన్మాష్టమి
సెప్టెంబర్ 7 శనివారం గణేష్ చతుర్థి
సెప్టెంబర్ 17 మంగళవారం అనంత్ చతుర్దశి
అక్టోబర్ 2 మంగళవారం గాంధీ జయంతి
అక్టోబర్ 12 దసరా (శనివారం)
అక్టోబర్ 17 గురువారం మహర్షి వాల్మీకి జయంతి
నవంబర్ 1 శుక్రవారం దీపావళి
నవంబర్ 12 మంగళవారం కార్తీక ఏకాదశి
నవంబర్ 15 శుక్రవారం గురునానక్ జయంతి
ప్రతి సంవత్సరం, స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, గాంధీ జయంతి వంటి జాతీయ సెలవు దినాలలో భారతదేశంలో డ్రైడేలుగా పాటిస్తారు. ఇవేకాకుండా రాష్ట్రాల వారీగా స్థానికంగా జరిగే ఉత్సవాలు, పండుగలు, ఇతర ప్రత్యేక సందర్భాలలో భద్రతాకారణాల దృష్ట్యా డ్రైడేలను అమలు చేస్తారు.