Telangana: సెక్రటేరియట్ కూల్చివేతలో సమీపంలోని దేవాలయం, మసీదులపై పడిన శిథిలాలు, విచారం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్, ప్రభుత్వ ఖర్చుతో కొత్తగా నిర్మిస్తామని హామి

తెలంగాణ రాష్ట్రం సెక్యులర్ రాష్ట్రం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లౌకిక స్ఫూర్తిని కొనసాగిస్తాం. ఇది కాకతాళీయంగా జరిగిన సంఘటన. దీన్ని అందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలి’’ అని ముఖ్యమంత్రి తన ప్రకటనలో కోరారు....

Telangana CM KCR | Photo: CMO

Hyderabad, July 10:  తెలంగాణ సెక్రటేరియట్ పాత భననాల కూల్చివేత సందర్భంగా అక్కడున్న దేవాలయం, మసీదులకు కొంత ఇబ్బంది కలగడం పట్ల ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు విచారం వ్యక్తం చేశారు. సెక్రటేరియట్ స్థలంలోనే ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ విస్తీర్ణంలో, విశాలంగా దేవాలయం మరియు మసీదులను పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని సీఎం ప్రకటించారు.

‘‘తెలంగాణ సెక్రటేరియట్ పాత భవనాలను కూల్చివేసి, కొత్త భవన సముదాయం నిర్మించడానికి ప్రభుత్వం పూనుకున్నది. ఈ క్రమంలో అక్కడున్న ఎత్తయిన భవనాలు కూల్చే సందర్భంలో పక్కనే ఉన్న ప్రార్థనా మందిరాలపైన శిథిలాలు పడి కొంత నష్టం జరిగిందనే విషయం నాకు తెలిసింది. ఇలా జరగడం పట్ల నేను ఎంతో బాధపడుతున్నాను. చింతిస్తున్నాను. ఇలా జరిగి ఉండాల్సింది కాదు. పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మించడమే ప్రభుత్వ ఉద్దేశ్యం తప్ప, ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగించడం ప్రభుత్వ ఉద్దేశ్యం కాదు’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు, ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

‘‘ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ విస్తీర్ణంలో, విశాలంగా ఎన్నికోట్లయినా వెనుకాడకుండా దేవాలయం, మసీదులను పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మించి, వాటికి సంబంధించిన వ్యక్తులకు అప్పగిస్తాం. దేవాలయం, మసీదు నిర్వాహకులతో నేనే త్వరలోనే సమావేశమవుతాను. వారి అభిప్రాయాలు తీసుకుని, కొత్త సెక్రటేరియట్ భవన సముదాయంతో పాటుగా ప్రార్థనా మందిరాలను నిర్మించి ఇస్తామని హామీ ఇస్తున్నాను’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సచివాలయం కూల్చివేత పనులు ఆపండి, తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

‘‘తెలంగాణ రాష్ట్రం సెక్యులర్ రాష్ట్రం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లౌకిక స్ఫూర్తిని కొనసాగిస్తాం. ఇది కాకతాళీయంగా జరిగిన సంఘటన. దీన్ని అందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలి’’ అని ముఖ్యమంత్రి తన ప్రకటనలో కోరారు.

మరోవైపు సచివాలయం భవనాల కూల్చివేత ఆపమని తెలంగాణ హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భవనాల కూల్చివేత కారణంగా కాలుష్యం పెరిగిపోతుందని, శిథిలాలను ఏం చేయబోతున్నారో చెప్పాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. గ్రీన్ ట్రిబ్యూనల్ అనుమతులు లేకుండానే భవనాల కూల్చివేత ప్రారంభించారు, హైకోర్టును తప్పుదోవ పట్టించారు అంటూ పిటిషనర్ పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలతో మరోసారి కూల్చివేత ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. దీనిపై తదుపరి విచారణ సోమవారం కోర్టు ముందుకు రానుంది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

CM Revanth Reddy: ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపేందుకు తెలంగాణ నుండి మద్దతిస్తాం...మరో రెండు హామీలను ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌తోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమని వెల్లడి

Chandrababu on Telangana: వీడియో ఇదిగో, నా విజన్ వల్లే తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది, సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Liquor, Meat Ban in Madhya Pradesh: మత పరమైన ప్రదేశాల్లో మాంసం, మద్యం దుకాణాలు బంద్, కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్న మధ్యప్రదేశ్ సర్కారు

Kiran Kumar Reddy on YSR: వైఎస్ఆర్ బతికి ఉన్నా తెలంగాణ వచ్చి ఉండేది, కొత్త చర్చకు తెరలేపిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మేం తెలంగాణకు అనుకూలం తీర్మానం అసెంబ్లీలో పెట్టాలంటూ..

Share Now