Telangana High Court: సచివాలయం కూల్చివేత పనులు ఆపండి, తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు, దేవాలయం, మసీదు దెబ్బతినడంపై ఆవేదన వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
High Court of Telangana | (Photo-ANI)

Hyderabad, july 10: తెలంగాణ ప్రభుత్వం (TS Govt) చేపట్టిన సచివాలయం భవనాల కూల్చివేత పనులు ఆపేయాలని తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కాగా కూల్చివేల వల్ల పొల్యూషన్ ఎక్కువవుతుందని భవనాల కూల్చివేత పనులు (demolition of secretariat) నిలిపి వేయాలని దాఖలైన ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం(పిల్)పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సంధర్భంగా భవనాల కూల్చివేతకు ఎలాంటి అనుమతులు తీసుకున్నారో పూర్తి వివరాలు తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్, ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం, కొత్త సెకట్రేరియట్ నిర్మాణాన్నిచేపట్టనున్న తెలంగాణ ప్రభుత్వం

కోవిడ్‌-19 నిబంధనలు ఉల్లంఘిస్తూ భవనాలను కూల్చివేస్తున్నారని ప్రొఫెసర్ పీఎల్‌ విశ్వేశ్వరరావు బుధవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిల్ ధాఖలు చేశారు. ప్రభుత్వ చర్యల వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని, 5 ల‌క్ష‌ల మంది పీల్చే స్వ‌చ్ఛ‌మైన గాలి కలుషితం అవుతుందని కోర్టుకు విన్నవించారు. మున్సిపాలిటీ సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ నిబంధ‌న‌ల‌ను పట్టించుకోకుండా కూల్చివేత చేప‌డుతున్నార‌ని పేర్కొన్నారు. తెలంగాణలో 30 వేలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో కొత్తగా మరో 1410 పాజిటివ్ కేసులు నమోదు, 331కి పెరిగిన కరోనా మరణాలు

ఈ క్రమంలో ఇప్పటికే సచివాలయంలోని సగానికి పైగా భవనాలను కూల్చివేశామని అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసిన న్యాయస్థానం.. అప్పటి వరకు ఎలాంటి కూల్చివేత పనులు చేపట్టొందని ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ సచివాయం కూల్చివేత సందర్భంగా ఆ ప్రాంతంలో వున్న దేవాలయం, మసీదు కొంత దెబ్బతిన్నాయి. ఈ ఘనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సెక్రటేరియట్ స్థలంలోనే ఇప్పుడున్న దాని కన్నా పెద్దగా, విశాలంగా ఆలయంతో పాటు మసీదును నిర్మించి ఇస్తామన్నారు. ఎత్తైన భవనాలు కూల్చే సందర్భంలో అక్కడే ఉన్న ప్రార్థనా మందిరాలపై శిథిలాలు పడి అవి దెబ్బతినడంపై తాను చాలా బాధపడుతున్నాను అన్నారు.

పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మించడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని, ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగించడం తమ అభిమతం కాదన్నారు. ఆలయం, మసీదు నిర్వాహకులతో త్వరలోనే సమావేశమవుతానని, వారి అభిప్రాయాలు తీసుకుని, కొత్త సెక్రటేరియట్ భవన సముదాయంతో పాటుగా ప్రార్థనా మందిరాలను నిర్మించి ఇస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు.