CM KCR Meeting Update: రూ.3 వేల కోట్లతో తొమ్మిది ఎత్తిపోతల పథకాలు, ఫిబ్రవరి 10న శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్, రేపు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం భేటీ, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులతో ముగిసిన తెలంగాణ సీఎం భేటీ

తెలంగాణభవన్‌లో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనున్నది. రాష్ట్ర కమిటీ సభ్యులతోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, నగర మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్‌ అధ్యక్షులను ఈ సమావేశానికి ఆహ్వానించారు.

Telangana CM KCR | Photo: CMO

Hyderabad, Feb 6: తెలంగాణభవన్‌లో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనున్నది. రాష్ట్ర కమిటీ సభ్యులతోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, నగర మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్‌ అధ్యక్షులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ కమిటీల నియామకం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక, ఏప్రిల్‌ 27న పార్టీ వార్షిక మహాసభ, ఇతర సంస్థాగత అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు.

ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ (Chief Minister K Chandrasekhar Rao) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీశ్ రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మార్చి 1 నాటికి పార్టీ సభ్యత్వ ప్రక్రియ పూర్తి చేయాలని శుక్రవారం నల్లగొండ నేతలకు సీఎం కేసీఆర్‌ వివరించినట్టు సమాచారం.

మళ్లీ వివాదంలో చిక్కుకున్న పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి, ఆ కులం ఆఫీసర్లకు అక్షరం ముక్కరాదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు, క్షమాపణలు చెబుతూ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని వెల్లడి

నల్గొండ జిల్లా సాగునీటి వ్యవస్థపై ఈ సమావేశంలో చర్చించారు. వివిధ ప్రాజెక్టుల పరిధిలోని సాగుభూములను మినహాయించి, మిగిలిన ఆయకట్టుకు సాగు నీరు అందించడానికి రూ.3 వేల కోట్లతో ఎత్తిపోతల పథకాలు (lift irrigation schemes) చేపడతామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను దేవరకొండలోని నల్లికల్లు, నాగార్జున సాగర్, మునుగోడ్, కోడాడ్ మరియు హుజుర్నగర్ అసెంబ్లీ విభాగాలలో పూర్వపు నల్గొండ జిల్లాలో నిర్మిస్తారు.

ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించిన తెలంగాణ సర్కార్, కమిటీ మార్గదర్శకాలను ఆమోదిస్తూ దస్త్రంపై సంతకం చేసిన సీఎం కేసీఆర్

నెల్లికల్లుతో (Nellikallu) పాటు దాదాపు 9 ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుడతామని చెప్పారు. ఈ ఎత్తిపోతల పథకాలన్నింటికి ఒకే చోట శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 10 మధ్యాహ్నం 12.30 గంటలకు నెల్లికల్లులో శంకుస్థాపన చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. అదేరోజు మధ్యాహ్నం 2 గంటలకు హాలియాలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో (CM KCR public meeting at Nagarjunasagar) సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. కాగా త్వరలో నాగార్జునసాగర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ వ్యూహాలకు పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది.

వికారాబాద్‌ను తాకిన మిస్టరీ వ్యాధి, భారీ సంఖ్యలో కోళ్లు, కాకులు మృత్యువాత, శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపిన అధికారులు

ఇదిలా ఉంటే దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాల తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఇదే కావడం విశేషం. పట్టబధ్రుల ఎన్నికలు, సాగర్ ఉపఎన్నిక, వరంగల్, ఖమ్మం కార్పోరేషన్ల ఎన్నికలకు కేసీఆర్ దిశా నిర్ధేశం చేయనున్నారు. ఈ నెల 17న కేసీఆర్ 67 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేయనున్నారు. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించనున్నట్టు తెలుస్తోంది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

SLBC Tunnel Rescue Operation: ఎస్‌ఎల్‌బీసీ ఘటనలో బాధితులు బతికే అవకాశం లేదు, లోపల పరిస్థితి దారుణంగా ఉందన్న మంత్రి జూపల్లి, వందలాది మందితో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులు, కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్మికుల వివరాలివే

Swarna Vimana Gopuram Maha Kumbhabishekam: మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసిన యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, స్వర్ణ విమాన గోపురం మహాకుంభాభిషేకానికి రావాల్సిందిగా ఆహ్వానం

CM Revanth Reddy: మహిళలకే మొదటి ప్రాధాన్యం..600 ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి, స్వయం సహాయక సంఘాలకు ఏడాదికి రెండు చీరలు కానుకగా ఇస్తామని వెల్లడి

Share Now