Telangana Dalit Bandhu Scheme: హుజూరాబాద్‌లో ఇల్లు లేని దళిత కుటుంబం ఉండకూడదు, దశల వారీగా దళితబంధు పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం, Dalit Bandhu అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన దళితబంధు (Telangana Dalit Bandhu ) అవగాహన సదస్సు ప్రగతి భవన్ లో జరిగింది. దళితబంధు’పథకం అవగాహన సదస్సులో పాల్గొనేందుకు హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి 412 మంది దళిత ప్రతినిధులు, 15 మంది రిసోర్స్‌పర్సన్‌లు కలిపి మొత్తం 427 మంది 16 ప్రత్యేక ఏసీ బస్సుల్లో వచ్చారు.

CM KCR (Photo-Twitter)

Hyderabad, July 27: సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన దళితబంధు (Telangana Dalit Bandhu ) అవగాహన సదస్సు ప్రగతి భవన్ లో జరిగింది. దళితబంధు’పథకం అవగాహన సదస్సులో పాల్గొనేందుకు హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి 412 మంది దళిత ప్రతినిధులు, 15 మంది రిసోర్స్‌పర్సన్‌లు కలిపి మొత్తం 427 మంది 16 ప్రత్యేక ఏసీ బస్సుల్లో వచ్చారు. ప్రగతిభవన్‌లో అవగాహన సదస్సు సుమారు 8 గంటలపాటు సుదీర్ఘంగా సాగింది. ఉదయం 11.30కు సమావేశం ప్రారంభంకాగా దళితబంధు పథకం ప్రత్యేకతలను సీఎం కేసీఆర్‌ వివరించారు.

హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని దళిత వాడల స్థితిగతులను (Telangana Dalit Bandhu scheme for Dalit empowerment) తెలియజేసేలా ప్రొఫైల్‌ తయారు చేయాలి. హుజూరాబాద్‌లో (Huzurabad Assembly Constituency) ఇల్లు లేని దళిత కుటుంబం లేకుండా వంద శాతం పూర్తికావాలి. ఖాళీ స్థలాలున్న వారు ఇండ్ల నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా దళితులకు దీనిని అమలు చేస్తాం.

నియోజకవర్గంలోని దళితవాడల్లో రేషన్‌కార్డులు, పింఛన్లు సహా అన్ని రకాల సమస్యలను గుర్తించి అధికారులు నివేదిక తయారు చేయాలి. వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వమే ఉచితంగా వైద్య సాయం చేస్తుంది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో వారం పదిరోజుల్లో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి, అసైన్డ్‌ సహా దళితుల అన్నిరకాల భూసమస్యలను పరిష్కరించాలి..’’అని కేసీఆర్‌ (Chief Minister K. Chandrashekar Rao) అధికారులను ఆదేశించారు.

సీఎం కేసీఆర్ ప్రసంగం హైలెట్స్ 

దళితబంధు ఒక కార్యక్రమం కాదు.. ఇదొక ఉద్యమం.. ఒక్కడితో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం భారత రాజకీయ వ్యవస్థ మీద ఒత్తిడి తెచ్చి విజయాన్ని సాధించి పెట్టింది. ఇప్పుడు దళితబంధు కార్యక్రమం దళితుల అభి వృద్ధితో పాటు తెలంగాణ ఆర్థికాభివృద్ధికి దారులు వేస్తుంది. అవకాశం, సహకారం లేక బాధపడు తున్న వర్గాలకు మార్గం చూపుతుంది. ఇక్కడి దళితుల విజయం ఇతర కులాలు, వర్గాలకే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశానికి వెలుతురు ప్రసరింప చేస్తుంది’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. మనిషిపై తోటి మనిషి వివక్ష చూపించే దుస్థితి మీద సెంటర్‌ ఫర్‌ సబాల్టర్న్‌ స్టడీ ద్వారా తాను కూడా అధ్యయనం చేశానని కేసీఆర్‌ వివరించారు. కక్షలు, కార్పణ్యాలు ద్వేషాలు పోయి పరస్పర విశ్వాసం పెంచుకుని ఒకరికొకరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. దళిత మహిళ మరియమ్మ మరణానికి కారకులైన పోలీసులను ఉద్యోగం నుంచి తొలగించిన విషయాన్ని ప్రస్తావించారు.

Here's TS CMO Tweet

రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒక్కో వర్గాన్ని, ఒక్కో రంగాన్ని బాగు చేసుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వమే స్వయంగా అండగా ఉన్నప్పుడు స్వీయ అభివృద్ధి కోసం దళిత సమాజం పట్టుదలతో పనిచేయాలి. తమలో ఇమిడి ఉన్న పులిలాంటి శక్తిని గుర్తించి ముందుకు సాగాలి. దళారులకు, ప్రతీప శక్తులకు దూరంగా ఉండాలి. దళితవాడల్లో ఇప్పటికే నమోదై ఉన్న పరస్పర కేసులను వాపస్‌ తీసుకుని పరస్పర సౌభ్రాతృత్వాన్ని పెంచుకోవాలి. అప్పుడే మన విజయానికి బాటలు పడతాయన్నారు.

ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంతో దళిత సమాజం తమకు ఇష్టమైన పరిశ్రమ, ఉపాధి, వ్యాపారాన్ని ఎంచుకుని వ్యాపారవర్గంగా అభివృద్ధి చెందాలి. గ్రామంలోని ఇతర వర్గాలు దళితుల వద్దకు అప్పుకోసం వచ్చేలా ఆర్థిక సాధికారత సాధించాలి. అంబేద్కర్‌ ఆశయాలను అమలు చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో విద్యావంతులైన దళితులు కదిలి రావాలి. హుజూరాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభమవుతున్న దళితబంధును విజయవంతం చేసేందుకు పట్టుదలగా పనిచేయాలి. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కల్పించాలి. దళితులు విజయం సాధించి వెలుగు దివ్వెలు, కరదీపికలుగా మారాలి.

హుజూరాబాద్‌లో సాధించే విజయం మీదనే తెలంగాణ దళితబంధు విజయం ఆధారపడి ఉంది, దళితబంధు పథకం కార్యక్రమం కాదు.. ఉద్యమం, హుజూరాబాద్‌ ప్రతినిధులతో ప్రగతి భవన్‌లో సమావేశమైన సీఎం కేసీఆర్‌

వివిధ రకాల ఉపాధి, పరిశ్రమ, వ్యాపార రంగాలను గుర్తించి లబ్ధిదారుల ఇష్టాన్ని బట్టి ఆర్థిక సాయం అందిస్తాం. దానితోపాటు లబ్ధిదారులు, ప్రభుత్వ భాగస్వామ్యంతో ‘దళిత రక్షణ నిధి’ఏర్పాటు చేస్తాం. కలెక్టర్ల పర్యవేక్షణలో లబ్ధిదారుల కమిటీ దానిని నిర్వహిస్తుంది. ఆ నిధిలో ఏటా కనీస మొత్తాన్ని జమ చేస్తూ దళితులు మరింత పటిష్టంగా నిలదొక్కుకునేందుకు వినియోగిస్తాం.

దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొందేవారికి గుర్తింపు కార్డు ఇస్తాం. ప్రత్యేకమైన బార్‌కోడ్‌తో కూడిన ఎలక్ట్రానిక్‌ చిప్‌ను ఆ ఐడీ కార్డులో చేర్చి పథకం అమలుతీరు సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందుపరుస్తాం. నిరంతర పర్యవేక్షణ ద్వారా ఎటువంటి ఒడిదుడుకులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. లబ్ధిదారుడు తను ఎంచుకున్న పనిద్వారా ఆర్థికంగా ఎదగాలే తప్ప జారి పడనివ్వమని అన్నారు.

దళితబంధు పథకం కింద ఇచ్చే మొత్తం పూర్తిగా ఉచితం, ఇందుకోసం రూ. లక్ష కోట్లయినా ఖర్చుపెడతాం, ఈటెల చిన్నోడు..ఏం చేయలేడు, హుజూరాబాద్ నేతలతో సీఎం కేసీఆర్, తనుగుల ఎంపీటీసీ భర్త రామస్వామికి స్వయంగా ఫోన్‌ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన దళితబంధు అవగాహన సదస్సులో మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, గోరటి వెంకన్న, ప్రభాకర్, రాజేశ్వర్‌రావు.. ఎమ్మెల్యేలు బాల్క సుమన్, తాటికొండ రాజయ్య, ఆరూరి రమేశ్, రసమయి బాలకిషన్, గా>్యదరి కిషోర్, చంటి క్రాంతి కిరణ్, సండ్ర వెంకటవీరయ్య, దుర్గం చిన్నయ్య, హన్మంత్‌ షిండే, సుంకె రవిశంకర్, కె.మానిక్‌రావు, కాలె యాదయ్య, మెతుకు ఆనంద్, జి.సాయన్న, వీఎం అబ్రహం, చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. ఇక సీపీఎం, సీపీఐ నేతలు వెంకట్, బాలనర్సింహ, ప్రభుత్వ సీఎస్‌ సోమేశ్‌కుమార్, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రెటరీ నర్సింగ్‌రావు, కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రాహుల్‌ బొజ్జా, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండా శ్రీనివాస్, పలు ఇతర శాఖల ఉన్నతాధికారులు, హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన సుమారు 450 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now