Dalit Bandhu Scheme: దళితబంధు పథకం కింద ఇచ్చే మొత్తం పూర్తిగా ఉచితం, ఇందుకోసం రూ. లక్ష కోట్లయినా ఖర్చుపెడతాం, ఈటెల చిన్నోడు..ఏం చేయలేడు, హుజూరాబాద్ నేతలతో సీఎం కేసీఆర్, తనుగుల ఎంపీటీసీ భర్త రామస్వామికి స్వయంగా ఫోన్‌ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి
Dalit Bandhu Scheme CM KCR (Photo-Twitter)

Hyderabad, July 25: హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్ పార్టీ (TRS) అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది. కేసీఆర్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నదళిత బంధు పథకాన్ని (Dalit Bandhu Scheme) హుజూరాబాద్ నియోజకవర్గంలో మరింత బలంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టి దశల వారీగా దీనిని రాష్ట్రంలో అమలు చేస్తామని సీఎం కేసీఆర్ (Chief Minister K Chandrashekar Rao) చెప్పారు.

ఇక సీఎం కేసీఆర్ స్వయంగా దళిత నేతలకు ఫోన్ చేశారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ దళిత నేతలతో ఈ నెల 26న సమావేశం ఉంటుందని, ఈ సమావేశానికి రావాలని వారిని ఆయన ఆహ్వానించారు. హైదరాబాదు ప్రగతి భవన్ లో జరిగే ఈ సమావేశానికి మొత్తం 427 మందిని ఆహ్వానిస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలను ఎంపిక చేశారు.

నిన్న సీఎం కేసీఆర్.... తనుగుల గ్రామం (జమ్మికుంట మండలం) ఎంపీటీసీ వాసాల నిరోష భర్త వాసాల రామస్వామితో (CM KCR phone call to Thanugula MPTC Husband Ramaswamy) మాట్లాడారు. జులై 26న మండల కేంద్రాల్లో సమావేశం కావాలని, ఆపై హుజూరాబాద్ చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి హైదరాబాద్ రావాలని వారికి వివరించారు. ఈ సందర్భంగా మాజీమంత్రి ఈటల రాజేందర్ తన పట్ల వ్యవహరించిన తీరును రామస్వామి సీఎం కేసీఆర్ కు తెలిపాడు. అందుకు కేసీఆర్ స్పందిస్తూ.... ఈటల రాజేందర్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఈటల చిన్నవాడని వ్యాఖ్యానించారు. దళిత బంధును (CM KCR Dalit Bandhu Scheme) హుజూరాబాద్ లో అమలు చేశాక, రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని రామస్వామితో చెప్పారు.

Here's TS CMO Tweet

హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని దళిత సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, కార్యకర్తలు శనివారం ప్రగతిభవన్‌కు వచ్చారు. ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా బండా శ్రీనివాస్‌ను నియమించడంపై వారు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్‌ వారిని ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణలో అర్హులైన వారందరికీ దళిత బంధు పథకం అందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. కాళ్లు, రెక్కలు మాత్రమే ఆస్తులుగా కలిగిన కుటుంబాలనే మొదటి ప్రాధాన్యంగా ఎంపిక చేస్తామన్నారు. రైతు బందు పథకాన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టి దశల వారీగా దీనిని రాష్ట్రంలో అమలు చేస్తామని, ఇందుకోసం రూ.80 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.

మీరాబాయ్ చానుకి సీఎం కేసీఆర్ అభినందనలు, ఇదే స్ఫూర్తిని మన క్రీడాకారులు కొనసాగించి మరిన్ని పతకాలను దేశానికి సాధించిపెట్టాలని ఆకాంక్షించిన తెలంగాణ ముఖ్యమంత్రి

తెలంగాణ ప్రజలు గత పాలనలో గొర్రెల మందలో చిక్కుకుపోయిన పులి పిల్లల్లాంటి వాళ్లనే సంగతిని స్వయంపాలన వచ్చాక ప్రపంచం గమనించింది. తెలంగాణ అభివృద్ధిని చూసి దేశం నేడు ఆశ్చర్యపోతోంది. రాజులు, జాగీర్దార్లు జమీందార్లు, భూస్వాములు, అనంతరం వలస పాలకులు.. ఇలా 100 ఏళ్ల పాటు అనేక రకాల పీడనను అనుభవించిన తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. అన్ని రంగాలను ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ వస్తున్నాం. ఉద్యమం ప్రారంభించిన మొదట్లో తెలంగాణ వస్తదా అని అనుమానించారు... వచ్చింది. 24 గంటల కరెంటు సాధ్యమేనా అన్నారు.

సాధ్యం చేసి చూపాం. కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించినప్పుడు అయ్యేదేనా అని సంశయించారు.. అది కూడా అయింది. దండగన్న వ్యవసాయాన్ని పండగ చేశాం. రైతుబంధు తెచ్చినప్పుడు కొందరు పెదవి విరిచారు. ఇప్పుడు తెలంగాణ రైతులు మూడు కోట్ల టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నారు. రోహిణీ కార్తెలోనే నాట్లేసుకునే రోజులొచ్చాయి. అలాగే దళిత బంధును కూడా కొందరు అనుమానిస్తున్నారు. వాటినన్నింటినీ పటాపంచలు చేస్తాం. విజయం సాధిస్తామని కేసీఆర్ అన్నారు.

జల దిగ్బంధంలో చిక్కుకున్న తెలంగాణ, నేడు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు, హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ, వరద సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు

ఇన్నాళ్లూ ప్రభుత్వాలు ఏవేవో పథకాలు తెచ్చి బ్యాంకుల గ్యారెంటీ అడిగాయి. కడుపేద దళితులు అవి ఎక్కడ తెస్తారు? అందుకే దళిత బంధు పథకం ద్వారా ప్రభుత్వం చేసే ఆర్థిక సాయం పూర్తి ఉచితం. ఇది అప్పుకాదు. తిరిగిఎవ్వరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇందులో దళారుల మాటే ఉండదు. నేరుగా అర్హులైన వారి బ్యాంకు ఖాతాలో ఆర్థిక సాయం వచ్చి చేరుతుంది. దళితుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచాలన్నది మా సంకల్పం.

వారి అభివృద్ధిని వారే నిర్వచించుకోగలగాలి. వారిలో ఆ భరోసాను కలిగించడంలో భాగమే ఈ దళిత బంధు పథకం. ఇచ్చిన పైసలు పప్పులు, పుట్నాలకు ఖర్చు చేయకూడదు. పైసా పెట్టి పైసా సంపాదించే ఉపాధి మార్గాలను అన్వేషించాలి. ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఉండాలి. చిరునవ్వులతో పరస్పరం పలకరించుకోవాలి. కొట్లాటలు, కక్షలు, కార్పణ్యాలు, ద్వేషాలు లేనివిగా దళిత వాడలు పరిఢవిల్లాలి. ఒకరి మీద ఒకరు పెట్టుకున్న కేసులను ఎత్తేసుకోవాలి. ఒకరు ఏమాత్రం కింద పడే పరిస్థితి కనిపించినా వెంటనే ఆదుకొనే ఖోజా జాతి మనందరికీ ఆదర్శం కావాలి’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

ఈ సందర్భంగా సీఎం ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బండా శ్రీనివాస్‌ను శాలువాతో సత్కరించారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఎంతో క్రమశిక్షణతో, నిబద్ధతతో పనిచేస్తున్న శ్రీనివాస్‌కు పదవితో పాటు తెలంగాణ దళిత సమాజాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ఆయన నెత్తిన పెద్ద బాధ్యత(బండ) పెట్టానన్నారు. ఆయన దానిని సునాయాసంగా మోస్తారని భావిస్తున్నానన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, రైతు బంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌, టీఆర్‌ఎస్వీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, హుజూరాబాద్‌ జడ్పీటీసీ సభ్యుడు బక్కారెడ్డి, కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, రాష్ట్ర దళిత సంఘాల నేతలు, పలువురు దళిత నాయకులు, భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

Here's Audio Call

వైరల్ అవుతున్న రామస్వామితో సీఎం కేసీఆర్‌ సంభాషణ ఇదే

సీఎం: హలో రామస్వామి గారు.. బాగున్నారా?

రామస్వామి: బాగున్నాను.. సార్‌.

సీఎం: రామస్వామిగారు దళితబంధు విజయం మీద తెలంగాణ దళిత జాతి భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇది బాధ్యతతో, ఓపికతో, çస్పష్టమైన అవగాహన దృక్పథంతో చేసే పని.

రామస్వామి: అవును సార్‌..

సీఎం: నా రిక్వెస్ట్‌ ఏందంటే.. మీ జిల్లా కలెక్టర్‌ మీకు ఫోన్‌ చేస్తడు. మీరు ఆయన దగ్గర రేపు లంచ్‌ చేయాలె. 26 నాటి కార్యక్రమం గురించి అవగాహన చేసుకోవాలె. 26న ఉదయం అందరూ మీ మండల కేంద్రంలో జమ అయితరు. అక్కడ ప్రభుత్వం బ్రేక్‌ఫాస్ట్‌ ఏర్పాటు చేస్తది. బస్సు ఉంటది. అంతా బస్సులో ఎక్కి హుజూరాబాద్‌ టౌన్‌కు వెళ్తరు. అన్ని మండలాల బస్సులు అక్కడికి వస్తయి. అంతా మొత్తం 427 మంది.. 30, 40 మంది అధికారులు ఉంటరు. అక్కడి నుంచి నా దగ్గరకు వస్తరు. ఆ రోజంతా నేను మీతోనే ఉంటా.

రామస్వామి: సంతోషం సార్‌..

సీఎం: ప్రగతిభవన్‌కు రాగానే టీ తాగి మీటింగ్‌ స్టార్ట్‌ చేసుకుంటం. రెండు గంటలు మీటింగ్‌.. తర్వాత లంచ్‌ చేసుకొని.. మళ్లీ 2 గంటలు కూర్చొని అపోహలు, అనుమానాలు, మంచీచెడ్డా మాట్లాడుకుందాం. హుజూరాబాద్‌ నియోజకవర్గం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పోవాల్సి ఉంటుంది. అన్నీ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తది. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నేను మీతోనే ఉంటాను.

రామస్వామి: థ్యాంక్స్‌ సార్‌. మా జాతికి న్యాయం జరుగుతుందనే సంపూర్ణ భరోసా ఉంది. మీరు ఫిక్స్‌ అయితే అవుతుంది సార్‌.

సీఎం: వందకు వంద శాతం చేద్దాం. ప్రాణం పోయినా వెనుకాడేదిలేదు. రెండేళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడి పోతమో ప్రపంచానికి చూపిద్దాం.

రామస్వామి: ఓకే సార్‌.. నమస్కారం సార్‌.

రామస్వామి: నేను 2001 నుంచీ పనిచేస్తున్నాను సర్‌. కానీ ఈటల రాజేందర్‌ నన్ను ఎప్పుడూ పట్టించుకోలే. అవసరం, సందర్భం వచ్చినప్పుడు ప్రతి విషయంలో పక్కనపెట్టిండు. అయినా నేను మీ (కేసీఆర్‌) నాయకత్వం మీద నమ్మకంతో పనిచేసుకుంటూ వచ్చిన. మొన్న 2018లో కూడా ఎంపీటీసీ టికెట్‌ ఇవ్వకపోతే.. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచినం సర్‌. తర్వాత ఈటల రాజేందర్‌ దగ్గరికి ఎప్పుడూ కూడా పోలేదు. నాకు వినోద్‌కుమార్‌ సార్, పరిపాటి రవీందర్‌రెడ్డి సార్‌ నాకు దేవుడిలా ఉన్నారు.

సీఎం: ఒక రిక్వెస్టు ఏందంటే.. మీరు వచ్చేయండి ఇక్కడికి (ప్రగతి భవన్‌కు).. ఆ రోజు చెప్తాను. అన్ని విషయాలు మాట్లాడుకుందాం. వాడు చిన్నోడు.. రాజేందర్‌తో అయ్యేది లేదు.. సచ్చేది లేదు. విడిచిపెట్టండి. అది చిన్న విషయం.. చూసుకుందాం.. దళితబంధు మనకు పెద్ద విషయం. ప్రపంచానికే సందేశం ఇచ్చే మిషన్‌ ఇది. దీన్ని విజయవంతం చేసి చూపిద్దాం.