Asia's Largest 2 BHK Township: ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్‌రూం టౌన్ షిప్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్, ఒకేచోట ఏకంగా 15వేలకు పైగా ఫ్లాట్లతో భారీ నిర్మాణాలు
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు (Patancheru) అసెంబ్లీ నియోజకవర్గ పరిధి రామచంద్రాపురం మండలం కొల్లూరు (Kolluru) గ్రామంలో రెండో దశ కింద చేపట్టిన ఆసియాలోనే అతిపెద్దదైన కేసీఆర్ నగర్ 2 బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్ కాలనీని గురువారం ఉద యం 11 గంటలకు సీఎం కేసీఆర్ (CM KCR) ప్రారంభించనున్నారు.
Hyderabad, June 22: గ్రేటర్ పరిధిలోని నిరుపేద ప్రజల సొంతింటి కల నెరవేరనున్నది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు (Patancheru) అసెంబ్లీ నియోజకవర్గ పరిధి రామచంద్రాపురం మండలం కొల్లూరు (Kolluru) గ్రామంలో రెండో దశ కింద చేపట్టిన ఆసియాలోనే అతిపెద్దదైన కేసీఆర్ నగర్ 2 బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్ కాలనీని గురువారం ఉద యం 11 గంటలకు సీఎం కేసీఆర్ (CM KCR) ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేయనున్నారు. ఆనంతరం ఆరుగురు లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందించనున్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రభుత్వపరంగా లబ్ధిదారులకు ఒక్క నయాపైసా ఖర్చు లేకుండా ఉచితంగా పంపిణీ చేసే అతిపెద్ద హౌసింగ్ ప్రాజెక్టుగా కొల్లూరు నిలువనున్నది.
సుమారు 60 వేల మంది ఆవాసం ఉండేలా ఒకేచోట ఏకంగా 15,660 ఇండ్ల నిర్మాణాన్ని తెలంగాణ సర్కారు చేపట్టింది. నిరుపేదల కోసం సకల సౌకర్యాలతో కొల్లూరులో ఈ ఆదర్శ టౌన్‌షిప్‌ను (2 Bhk Dignity Housing Colony) నిర్మించింది. క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా కార్పొరేట్ హంగులతో పేదల కోసం కలల సౌధాలను నిర్మించింది. రూ.1,489.29 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టులో కార్పొరేట్ అపార్ట్‌మెంట్లకు తీసిపోకుండా సకల హంగులతో నిర్మాణాలు చేపట్టారు.
సంగారెడ్డి జిల్లా కొల్లూరు వద్ద జీహెచ్‌ఎంసీ నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇండ్ల సముదా యం ఆసియాలోనే అతిపెద్దదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ భారీ ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేయడం గర్వంగా ఉందని గురువారం ఆయన ట్వీట్ చేశారు. ‘ధైర్యంగా కల కనండి.. వాటిని సాకారం చేసేందుకు సం సిద్ధులు కండి’ అనేదే కేసీఆర్ గారి మంత్ర అని.. ఆ నినాదంతోనే డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఈ సముదాయాన్ని సీఎం కేసీఆర్ గురువారం ప్రారంభించనున్నట్టు తెలిపారు.