Revanth Reddy Review on Kaleshwaram Project: రాబోతున్న వ‌ర్షాకాలం! కాళేశ్వ‌రం ప్రాజెక్టు రిపేర్ పై సీఎం రేవంత్ రెడ్డి కీల‌క మీటింగ్, మ‌రోసారి క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న అవ‌స‌ర‌మ‌ని అభిప్రాయం

కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలు కుంగిపోవటంతో, తాత్కాలికంగా చేపట్టాల్సిన మరమ్మతులు, పునురుద్ధరణ చర్యలపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ (NDSA) మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో ఉన్న ముఖ్యమైన అంశాలు, సిఫారసులన్నింటినీ సీఎంతో పాటు మంత్రులకు ఉత్తమ్ కుమార్​రెడ్డి వివరించారు

Hyderabad, May 18: కాళేశ్వరం ప్రాజెక్టుపై (Kaleshwaram Project) నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికపై, ప్రభుత్వం తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) ఆరా తీశారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితో కలిసి సచివాలయంలో శనివారం సాయంత్రం చర్చలు జరిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలు కుంగిపోవటంతో, తాత్కాలికంగా చేపట్టాల్సిన మరమ్మతులు, పునురుద్ధరణ చర్యలపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ (NDSA) మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో ఉన్న ముఖ్యమైన అంశాలు, సిఫారసులన్నింటినీ సీఎంతో పాటు మంత్రులకు ఉత్తమ్ కుమార్​రెడ్డి వివరించారు. మరో నెల రోజుల్లో వర్షాకాలం ప్రారంభం అవుతున్నందున ఈలోగా తీసుకోవాల్సిన చర్యలపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సి ఉంటుందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

Telangana Cabinet Meeting: తెలంగాణ ప్ర‌భుత్వానికి ఎన్నికల సంఘం షాక్, అనుమ‌తి రాక‌పోవ‌డంతో కేబినెట్ స‌మావేశం వాయిదా 

రిపేర్లు చేయాలా.. ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా.. మరింత నష్టం జరగకుండా ఏమేం చర్యలు చేపట్టాలనేది ఇరిగేషన్ విభాగం అధికారులతో కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. శనివారం నాటి కేబినేట్ భేటీ జరగకపోవడంతో ఈ కీలకమైన అంశాలపై చర్చించలేకపోయామని చెప్పారు. త్వరలోనే మేడిగడ్డ, సుందిళ్ల, అక్కడి పంప్ హౌస్‌లనును క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాల్సి ఉంటుందని అన్నారు.



సంబంధిత వార్తలు

KTR: దేవుళ్లను మోసం చేసిన మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి, మూసీని మురికి కూపం చేసిందే కాంగ్రెస్ పార్టీ..కేటీఆర్ ఫైర్, బఫర్‌ జోన్‌లో పేదల ఇండ్లు కూల్చి షాపింగ్ మాల్స్‌కు పర్మిషన్లా?

Nara Ramamurthy Naidu Passed Away: ఏపీ సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు మృతి, మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు..హీరో నారా రోహిత్ తండ్రే రామ్మూర్తి నాయుడు

CM Revanth Reddy: శైవ క్షేత్రాలకు తెలంగాణ ప్రసిద్ధి..కోటి దీపోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆనాటి త్రిలింగ క్షేత్రమే ఈనాటి తెలంగాణ..మహాకాళేశ్వరునికి కోటి పుష్పార్చనలో పాల్గొన్న సీఎం

Telugu CM's At Maharashtra Poll Campaign: మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో తెలుగు గుభాళింపులు, మూడు రోజుల పాటూ చంద్ర‌బాబు, రేవంత్ రెడ్డి స‌హా అనేక ముఖ్య‌నేత‌ల ప్ర‌చారం