CM Revanth Reddy Slams PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, కేంద్రానికి సవాల్ చేస్తున్నానని వెల్లడి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన తెలంగాణ ముఖ్యమంత్రి

బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ మీద నిప్పులు చెరిగారు. పుట్టుకతో ప్రధాని మోదీ బీసీ కాదని,ఆయన లీగల్లీ కన్వర్టెడ్‌ బీసీ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.సర్టిఫికెట్‌లలో మోదీ బీసీ కానీ మోదీ మనసంతా బీసి వ్యతిరేకి. మోదీ తొలిసారి సీఎం అయ్యాకే ఆయన కులాన్ని బీసీల్లో కలిపారు

Narendra Modi Is Not a Born BC says CM Revanth Reddy(X)

Hyd,Feb 14: తెలంగాణ యువజన కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా జక్కిడి శివచరణ్ (Jakkidi Shivacharan) ఎన్నికైన విషయం విదితమే.ఈ సందర్భంగా హైదరాబాద్ గాంధీ భవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో శివచరణ్ బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా కులగణన, ఎస్సీ వర్గీకరణపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌లో సీఎం రేవంత్ ప్రసంగించారు.

బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ మీద నిప్పులు చెరిగారు. పుట్టుకతో ప్రధాని మోదీ బీసీ కాదని,ఆయన లీగల్లీ కన్వర్టెడ్‌ బీసీ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.సర్టిఫికెట్‌లలో మోదీ బీసీ కానీ మోదీ మనసంతా బీసి వ్యతిరేకి. మోదీ తొలిసారి సీఎం అయ్యాకే ఆయన కులాన్ని బీసీల్లో కలిపారు. అన్నీ తెలుసుకునే మోదీ కులంపై మాట్లాడుతున్నా. కేంద్రానికి సవాల్ చేస్తున్నానని తెలిపారు

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అగ్ర రాజకీయ నేతలంతా యూత్ కాంగ్రెస్ (Youth Congress) నుంచే వచ్చారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR) సైతం యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వారేనని రేవంత్ రెడ్డి చెప్పారు. నేను ఆఖరి రెడ్డి సీఎంను అయినా.. ఫర్వాలేదు. మా నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టేందుకు క్రమక్షశిణ కలిగిన ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నా. ఇది నా నిబద్ధత. కులగణన.. నా కోసం, నా పదవి కోసం చేయలేదు. త్యాగానికి సిద్ధపడే.. కులాల లెక్కలు పక్కాగా తేల్చాం. మా నాయకుడి ఆదర్శం నిలబెట్టేందుకు నేను కార్యకర్తగా మిగిలేందుకు సిద్ధం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth reddy)అన్నారు.

నరేంద్ర మోడీ పుట్టుకతో బీసీ కాదు...సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్, మోడీ మనస్తత్వం బీసీలకు వ్యతిరేకమని సంచలన ఆరోపణలు

కొందరు ఆరోపిస్తున్నట్టు కులగణన సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగలేదు. ఇప్పుడు కులగణన సర్వేను తప్పు పడితే బీసీలు శాశ్వతంగా నష్టపోతారు. దేశం మొత్తం కూడా కులగణన సర్వే జరగాలని పార్లమెంట్‌లో మోదీని రాహుల్‌గాంధీ నిలదీశారు. ఈ సర్వే జరగకూడదని మోదీ, కేసీఆర్‌ (CM Revanth Reddy Slams BRS) కలిసి కుట్ర చేస్తున్నారు. నరేంద్రమోదీ పుట్టుకతో బీసీ కులస్థుడు కాదు. గుజరాత్‌ సీఎం అయ్యాక ఆయన కులాన్ని బీసీ జాబితాలో చేర్చుకున్నారు.

సర్టిఫికెట్‌ ప్రకారం మాత్రమే మోదీ బీసీ వ్యక్తి.. ఆయన వ్యక్తిత్వం మాత్రం అగ్ర కులం. కులగణన జరిగితే చట్ట ప్రకారం రిజర్వేషన్లు సాధించుకోవచ్చు. అధికారిక లెక్కలు ఉంటే బీసీల రిజర్వేషన్లు పెంచాలని సుప్రీంకోర్టు కూడా చెప్పొచ్చు. కులగణన సర్వే రెండో విడత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు ఇంటి ముందు మేలుకొలుపు డప్పు కొట్టాలని బీసీ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా. సర్వేలో పాల్గొనకపోతే సామాజిక బహిష్కరణే శిక్ష’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

హనుమంతరావు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు, కేసీఆర్ యూత్ కాంగ్రెస్‌లో పని చేశారని ముఖ్యమంత్రి రేవంత్ గుర్తు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా అక్కడ్నుంచే వచ్చారని పేర్కొన్నారు. రాజకీయాలకు యూత్ కాంగ్రెస్ అనేది మొదటిమెట్టని ఆయన చెప్పుకొచ్చారు. పదవులు వచ్చినా, రాకపోయినా కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉండాలని సూచించారు.

తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. పేదల ఆత్మగౌరవం కోసం ఇళ్లు కట్టిస్తున్నాం. డబుల్‌ బెడ్‌రూమ్‌ పేరుతో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలను మోసం చేశారు. ఆయన మోసం చేశారు కాబట్టే ప్రజలు మనకు అధికారం ఇచ్చారు. స్థానిక సంస్థల్లో యూత్‌ కాంగ్రెస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. పార్టీ కోసం పనిచేసే వారికే పదవులు ఇస్తాం. ఫ్లెక్సీలు కట్టి దండాలు పెట్టేవారికి పదవులు రావు. ఢిల్లీ నుంచి కాదు.. గల్లీ నుంచి వచ్చిన వారికే పదవులు ఇస్తాం. దేశంలోనే ఎవరూ చేయనంత రుణమాఫీ తెలంగాణ రైతాంగానికి చేశాం.

భూమి లేని వారికీ రూ.12 వేలు ఇస్తున్నాం. 55 వేల ఉద్యోగాలు భర్తీ చేసి చూపించాం. ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలను యూత్ కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎన్నికల్లో డబ్బుతో ఎవరూ గెలవలేరు. మేము ప్రజాభిమానంతో గెలిచాం. డబ్బులే గెలిపిస్తాయంటే కేసీఆర్‌కు 100 సీట్లు వచ్చి ఉండేవి. కొడితే గట్టిగా కొడతామని కేసీఆర్‌ అంటున్నారు. కేసీఆర్‌ను కొట్టాలంటే కేటీఆర్‌, కవిత, హరీశ్‌నే కొట్టాలి. కేసీఆర్‌ను కేటీఆర్‌ ఓడించారు, కేజ్రీవాల్‌ను కవిత ఓడించింది. కల్వకుంట్ల కుటుంబం అవినీతి చూసే ప్రజలు బుద్ధి చెప్పారు. దేశంలో కులగణన చేసిన ఏకైక ప్రభుత్వం మాది.

కులగణన, ఎస్సీ వర్గీకరణపై పక్కాగా చేసిన మా లెక్కను తప్పంటారా. కేసీఆర్‌ ఒక్క రోజే సర్వే చేసి కాకిలెక్కలు చూపించారు. చెట్ల మీద విస్తరాకులు కుట్టినట్టుగా గతంలో సర్వే చేశారు. తెలంగాణలో జీవించే హక్కు కేసీఆర్‌కు లేదు. గ్యాంబ్లర్స్‌ అంతా బీఆర్ఎస్‌లోనే ఉన్నారు. కులాల లెక్కలు ఎప్పటికీ తేలకూడదనే ఆ పార్టీ నేతలు పన్నాగం పన్నుతున్నారు. కేసీఆర్ లాంటి వాళ్లు తెలిసి, బలిసి సర్వేలో పాల్గొనలేదు. జనాభా లేకపోయినా రావులంతా పదవులు పంచుకున్నారు. బీసీలు ఆ లెక్కలు అడుగుతారనే అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన నా కోసం కాదు.. క్రమశిక్షణ కలిగిన సీఎంగా కులగణన చేయిచాం. దొంగ లెక్కలు చెప్పాలనుకుంటే మా కులాన్ని ఎక్కువ చూపించేవాళ్లం. బీసీ కులగణనకు రెండో విడత కూడా అవకాశం ఇచ్చాం.

కులగణన సర్వేలో పాల్గొనని కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావును సామాజిక బహిష్కరణ చేయాలని తీర్మానం చేశాం. లెక్కల్లో పాల్గొనాలని కేసీఆర్‌, కేటీఆర్‌ ఇళ్ల ముందు డప్పు కొట్టండి" అని అన్నారు.బహిష్కరణ కోసం మీ సమక్షంలో తీర్మానం చేస్తున్న. ప్రభుత్వ సర్వే తప్పుల తడక అని చెప్పే ప్రయత్నం బీఆర్‌ఎస్‌ చేసింది. భారత్ జోడో యాత్రలోనే రాహుల్ గాంధీ స్పష్టం గా కులగణన చేస్తాం అని హామీ ఇచ్చారు. దేశంలో ఉన్న అన్ని జాతులకు వారి ఫలాలు అందాలని రాహుల్ గాంధీ ఆకాంక్షించారు.డోర్ టు డోర్ వెళ్లిన సిబ్బంది ముందే డేటా ఎంట్రీ చేశాం. కేసీఆర్ సర్వే..కాకిలెక్కల సర్వే.తెలంగాణ సమాజంలో తిరిగే హక్కే కేసీఆర్, కేటీఆర్,సంతోష్ రావ్ లకు లేదన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Us Deportation: పంజాబ్‌ ప్రతిష్ట దిగజార్చేందుకు కుట్ర! అమెరికా నుంచి వచ్చే విమానాలను అమృత్‌సర్‌లో దించడంపై మండిపడ్డ సీఎం మాన్

Secunderabad Railway Station Demolition: ఇవిగో.. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వీడియోలు దాచుకోండి, చరిత్ర పుటల్లోకి జారుకుంటున్న 151 ఏళ్ల ఐకానిక్‌ భవనాలు, సరికొత్త హంగులతో రానున్న కొత్త రైల్వే స్టేషన్

CM Revanth Reddy Slams PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, కేంద్రానికి సవాల్ చేస్తున్నానని వెల్లడి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన తెలంగాణ ముఖ్యమంత్రి

CM Revanth Reddy: డబ్బులతో రాజకీయాల్లో విజయం సాధించలేం.. కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుందన్న సీఎం రేవంత్ రెడ్డి, లిక్కర్ స్కాంపై కీలక కామెంట్

Share Now