Revanth Reddy Slams KCR: కేసీఆర్ కు తెలంగాణ సెంటిమెంట్ లేదు, కేటీఆర్ మతిలేని వ్యాఖ్యలు, దశాబ్ది ఉత్సవాలకు కేసీఆర్ రాకపోవడంపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణకు 4 మంత్రి పదవులు వస్తాయని కూడా చెప్పారాయన. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లో (KCR) తెలంగాణ సెంటిమెంట్ లేదన్న సీఎం రేవంత్.. కేవలం వ్యాపారం మాత్రమే ఉందని విమర్శించారు.
Hyderabad, June 01: కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి (Revanth reddy) ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు 4 మంత్రి పదవులు వస్తాయని కూడా చెప్పారాయన. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లో (KCR) తెలంగాణ సెంటిమెంట్ లేదన్న సీఎం రేవంత్.. కేవలం వ్యాపారం మాత్రమే ఉందని విమర్శించారు. సెంటిమెంట్ వాడుకుని కేసీఆర్ లాభపడ్డారని ఆరోపించారు. సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని సీఎం రేవంత్ తెలిపారు. సమ్మక్క, సారలమ్మ, జంపన్నలను చంపిన వారిగానే కాకతీయ రాజులను చూస్తానని అన్నారు. టీజీ అన్నది తెలంగాణ పిల్లల గుండెల్లో నుండి వచ్చిందని చెప్పారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగస్వామి కావడం నా అదృష్టం అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీని గౌరవించుకోవడం జీవితకాల గొప్ప అవకాశం అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అవతరణనే (State Formation Celebrations) కేసీఆర్ కు ఇష్టం లేదన్న సీఎం రేవంత్.. కేసీఆర్ కు తెలంగాణ కేవలం వ్యాపారం మాత్రమే అని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆవిర్భావ వేడులకే రానోడు.. అసెంబ్లీకి వస్తాడా.? అని కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారు. కేసీఆర్.. ప్రధాన ప్రతిపక్ష నాయకుడా? లేక కమర్షియల్ వ్యాపారా? అని సీఎం రేవంత్ మండిపడ్డారు.
”రాష్ట్ర అవతరణ అంటే కేసీఆర్ కు గౌరవం లేదు. పాకిస్తాన్ మాదిరే.. ఓరోజు ముందే వేడుకలా..? గన్ పార్క్ ఇనుప కంచెలు అంటూ కేటీఆర్ వి మతి లేని వ్యాఖ్యలు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. నేను వెళ్లాలన్న ఈసీ అనుమతి తీసుకోవాల్సిందే. పదేళ్లు పాలించిన కేటీఆర్ కు (KCR) తెలియదా?
వేడుకలకు ఆహ్వానిస్తే కేసీఆర్ ఎందుకు రావడం లేదో చెప్పాలి. గన్ పార్క్ అమరుల స్థూపం అంటే కేసీఆర్ కు ద్వేషం. అమరుల ఆనవాళ్లు ఉండటం కేసీఆర్ కు నచ్చదు. లోగోపై పలు సూచనలు వచ్చాయి. చర్చిస్తున్నాం. లోగోపై అభ్యంతరాలుంటే.. ప్రభుత్వానికి ఎందుకు సూచించలేదు. ప్రకటించక ముందే ధర్నాలు చేస్తోంది.
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు బీజేపీని కూడా ఆహ్వానించాం. కిషన్ రెడ్డి, దత్తాత్రేయలను ఆహ్వానించాం. వేడుకలను రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నాం. రాష్ట్ర గీతంపై పూర్తి బాధ్యత, స్వేచ్చ అందెశ్రీకి ఇచ్చాం. ఎవరితో పాడించాలన్నది అందెశ్రీ నిర్ణయం. తెలంగాణ సమాజం పడినట్లుగా రాష్ట్ర గీతం ఉంటుంది. రాష్ట్రంలో కరెంట్ కోతలు లేవు. బహిరంగ చర్చకు సిద్ధం. రాష్ట్ర వ్యాప్తంగా లాగ్ బుక్ లను చూపేందుకు సిద్ధం” అని నిప్పులు చెరిగారు సీఎం రేవంత్.