TS Double Bedroom Houses Row: లక్ష ఇళ్ళు అంతా బోగస్, ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని తెలిపిన కాంగ్రెస్ పార్టీ,మీ డ్రామాలు ఆపాలని కాంగ్రెస్ పార్టీకి సూచించిన తెలంగాణ మంత్రి తలసాని
ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఆ ఇళ్లను (TS Govt 1 Lakh Double Bedroom Houses) చూపించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అడగడం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చూపిస్తానంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు (Congress MLA Mallu Bhatti Vikramarka) ఇంటికి వెళ్లడం చకచకా జరిగిపోయాయి. ఈ విషయం మీద మల్లు భట్టీ విక్రమార్క తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కుపెట్టారు.
Hyderabad, Sep 23: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్వహిస్తునన లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లపై (TS Double Bedroom Houses Row) తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఎక్కుపెట్టింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఆ ఇళ్లను (TS Govt 1 Lakh Double Bedroom Houses) చూపించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అడగడం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చూపిస్తానంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు (Congress MLA Mallu Bhatti Vikramarka) ఇంటికి వెళ్లడం చకచకా జరిగిపోయాయి. ఈ విషయం మీద మల్లు భట్టీ విక్రమార్క తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కుపెట్టారు.
అసెంబ్లీలో లక్ష ఇళ్లు కట్టాం.. కావాలంటే వెళ్లి చూసుకోండని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై ప్రభుత్వం చెప్పిన మాటల్లో నిజం లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. మాజీ ఎంపీలు హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్‌తో కలసి మంగళవారం శాసనసభ మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ’డబుల్’ లిస్ట్ పూర్తిగా బోగస్ అని వ్యాఖ్యానించారు. కట్టకపోయినా కట్టినట్టు లిస్ట్‌లో చూపించారని, కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.
ప్రజలకు నిజాలను చూపించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందని, ప్రభుత్వం చెబుతున్న లక్ష ఇళ్ల జాబితాలోని ఒక్కో ప్రాంతాన్ని మీడియాకు చూపించి ప్రజలకు వాస్తవాలను వివరిస్తామని చెప్పారు. మంత్రి కేటీఆర్ కార్పొరేట్లతో ఏసీ రూముల్లో చర్చలు జరపడం సరికాదని, బస్తీ ప్రజల బాధల్ని ప్రత్యక్షంగా తెలుసుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వం చెప్పిన ప్రాంతంలో దుర్బిణీ వేసి వెతికినా ఎక్కడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించాకే టీఆర్‌ఎస్ నాయకులను బస్తీల్లోకి అడుగుపెట్టనివ్వాలని ప్రజలకు భట్టి పిలుపునిచ్చారు.
Here's Dr BonthuRammohan,Mayor Tweet
ఇదిలా ఉంటే నాంపల్లి, కార్వాన్ ప్రాంతాలకు సంబంధించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను భోజగుట్టలో కడుతున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani srinivas Yadav) తెలిపారు. అయితే కోర్టులో కాంగ్రెస్ కేసులు వేస్తూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం ఆపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధిరలో రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మీ చెక్కులు భట్టి విక్రమార్క పంపిణీ చేస్తారని తెలిపారు. ఓపెన్ నాళాలపై క్యాపింగ్ లేకపోవడం బాధాకరమని మంత్రి తెలిపారు. అధికారుల పొరపాటుతో తప్పు జరిగిందని, సరిదిద్దుకుంటామన్నారు.
కాంగ్రెస్ సభ్యులు లొకేషన్ తెలుసుకొని వెళ్ళాలని, లక్ష బెడ్ రూమ్ ఇళ్ల జాబితాలో అప్జల్ సాగర్ లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నవ్వుల పాలు అవుతారన్న మంత్రి కాంగ్రెస్ నేతలకు ఓట్లు ఎవరు వేస్తారని ఎద్దేవా చేశారు.150 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరకరకరని విమర్శించారు. జీవిత కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని, కాంగ్రెస్ నేతలు చేసే డ్రామాలు ఆపాలని సూచించారు