Jagga Reddy: అవసరమైతే కొత్త పార్టీ పెడతా: జగ్గారెడ్డి, వాళ్లు చెప్పారని మూడు రోజులు టైం ఇస్తున్నా, నన్ను ఎవరూ కలవొద్దు, కావాలనే పార్టీ నుంచి బయటకు పంపిస్తున్నారంటూ ఆవేదన

కాంగ్రెస్ ( Congress) ను వీడాలని లేకపోయినప్పటకీ...తాజా పరిస్థితులు తనను అటువైపుగా ఆలోచించే విధంగా చేస్తున్నాయన్నారు.

జగ్గారెడ్డి (File : Pic)

Hyderabad, Feb 19: కాంగ్రెస్ పార్టీకి మరో మూడు రోజుల్లో రాజీనామా చేస్తానని ప్రకటించారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Sangareddy MLA Jagga Reddy). కాంగ్రెస్ ( Congress) ను వీడాలని లేకపోయినప్పటకీ...తాజా పరిస్థితులు తనను అటువైపుగా ఆలోచించే విధంగా చేస్తున్నాయన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తన పదవులకు రాజీనామా చేసి స్వతంత్రంగా ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోనియా (Sonia), రాహుల్ (Rahul Gandhi)గాంధీలకు లేఖ రాశారు. ‘దయచేసి నన్ను ఎవరూ కలవొద్దు.. నా వల్ల పార్టీకి, వ్యక్తిగత రాజకీయ జీవితానికి నష్టమైందనే భావనలో ఉన్న నాయకులు, కార్యకర్తలంతా రాజకీయంగా మంచిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని జగ్గారెడ్డి చెప్పారు. సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ అంటే తనకు చాలా ఇష్టం, గౌరవం అని, తాను స్వేచ్ఛగా రాజకీయాలు చేసుకున్నా సోనియా, రాహుల్‌ను గౌరవిస్తూనే ఉంటానని చెప్పారు. ఇక ఈ ప్రకటన విడుదల చేసిన తర్వాత క్షణం నుంచి తాను కాంగ్రెస్‌ గుంపులో లేనని ప్రకటించారు.

MLA Jagga Reddy Resigns Congress: నేడు కాంగ్రెస్ లో బాంబు పేల్చనున్న జగ్గారెడ్డి, నేడు పార్టీకి రాజీనామా చేసే చాన్స్, పటాన్ చెరులో ముఖ్యకార్యకర్తలతో సమావేశం, ఏ పార్టీలో చేరనని ప్రకటన...

‘మీడియా దృష్టిలో పడేందుకే మాట్లాడతాననడం సరికాదు. ఏదైనా కోపముంటే నేరుగా చెప్పడం నా వ్యక్తిత్వం. నిర్మోహమాటంగా మాట్లాడతాను కాబట్టే నా మీద మీడియా దృష్టి ఉంటుంది. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగాను. పదవులు ఆశించడం, అందుకోసం ప్రయత్నించడం రాజకీయాల్లో సహజం. కానీ, నామీద కోవర్టు అనే ముద్ర వేసే ప్రయత్నం జరుగుతోంది. నేను కాంగ్రెస్‌లో ఉంటే కొందరు ఇబ్బందిగా భావిస్తున్నారు. నా వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండొద్దనే ఉద్దేశంతో పార్టీ వీడాలనుకున్నా. కాంగ్రెస్‌ నుంచి బయటకు వెళ్లినా .. వేరే పార్టీలో చేరను. సీనియర్‌ నేతలు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, వీహెచ్‌తో పాటు పలువురు నేతలు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని నాకు చెప్పారు. బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని చాలా మంది నేతలు చెప్పారు. వారికి నచ్చజెప్పిన తర్వాతే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయాలనే ఉద్దేశంతో రెండు..మూడు రోజులు ఆగుతున్నా. లేకపోతే ఇప్పుడే రాజీనామా చేసే వాణ్ని. కాంగ్రెస్‌ బాగుండాలనే పార్టీని వీడేందుకు సిద్ధమయ్యా, నేను పార్టీ వీడినంత మాత్రాన కాంగ్రెస్‌ పార్టీకి వచ్చే నష్టం లేదు’’ అని జగ్గారెడ్డి వివరించారు.

Road Accident: మేడారం జాతరకు వెళ్లి వస్తుండగా విషాదం, ఆర్టీసీ బస్సు ఢీ కొని నలుగురి మృతి

తాజా పరిణామాల నేపథ్యంలో సోనియా, రాహుల్‌కు జగ్గారెడ్డి లేఖలు రాశారు. తాను ఏ తప్పూ చేయలేదని, సొంత పార్టీలో కుట్రపూరితంగా ప్రణాళికాబద్ధంగా టీఆర్ఎస్ కోవర్టు (TRS Covert) అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించే వ్యవస్థ కాంగ్రెస్‌లో లేకపోవడం దురదృష్టకరమని సోనియా, రాహుల్‌కు రాసిన సుదీర్ఘ లేఖలో తెలిపారు. వేరే రాజకీయ పార్టీ తనను పిలిస్తే అమ్ముడుపోయాడనే ఒక చరిత్ర ఉంటుందనే వెళ్లలేదని, ఇంత ఆర్థిక కష్టాల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీలో ఉండి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే కోవర్టు అంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు ప్రచారం చేస్తున్నారని వివరించారు. తన వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ అమ్ముకోనని, అందుకే ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. హుందాగా బతుకుదాం అనుకున్న కాంగ్రెస్‌ పార్టీలో తనపై కోవర్టు అనే ప్రచారం జరగడం చాలా బాధాకరమన్నారు. ఇలాంటి దుష్ర్పచారం చేస్తున్న మూర్ఖులు ఆలోచన చేయాలని హితవుపలికారు. వేరే పార్టీలోకి వెళ్లాలనుకుంటే నేరుగా వెళతా కదా? ఇక్కడే ఉండి కోవర్టు అని ప్రచారం చేయించుకునే కర్మ తనకెందుకని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో కూడా తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ నష్టపోతుందని చెబితే అప్పుడు నన్ను తెలంగాణ ద్రోహి అన్నారు.. కానీ, ఇప్పుడు అయ్యో జగ్గారెడ్డి చెప్పింది నిజమే కదా! రాజకీయంగా దెబ్బతిన్నామనే భావనలో ఉన్నారని చెప్పారు. ఈ పనికి మాలిన నిందలతో ఆవేదన చెందడం కంటే మనస్సాక్షికి కట్టుబడి స్వతంత్రంగా రాజకీయ జీవితం గడపడం మేలని నిర్ణయం తీసుకున్నట్టు జగ్గారెడ్డి వెల్లడించారు.



సంబంధిత వార్తలు

Tollywood Celebrities To Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని క‌లువ‌నున్న అల్లు అర‌వింద్, చిరంజీవి ప‌లువురు ప్ర‌ముఖులు, అల్లు అర్జున్ వ్య‌వ‌హారం త‌ర్వాత తొలి భేటీ

Revanth Reddy-Allu Arjun Issue: అల్లు అర్జున్ వ్యవహారంలో కీలక మలుపు.. ఈ కేసుపై ఎవరూ మాట్లాడవద్దంటూ మంత్రులకు, పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు

MP Kiran Kumar Reddy: అల్లు అర్జున్‌పై ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్, బన్నీ రియల్ హీరో కాదు, స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివారని ఆగ్రహం వ్యక్తం చేసిన భువనగిరి ఎంపీ

CM Revanth Reddy: సర్వమత సమ్మేళనంం తెలంగాణ, మత విద్వేషాలు రెచ్చగోడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి, క్రిస్టియన్ల సంక్షేమం- అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్న సీఎం