Accident Representative image (Image: File Pic)

ములుగు, ఫిబ్రవరి 19 : ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎన్ని భద్రతా చర్యలు తీసుకున్నా. రకరకాల కారణాల చేత జరిగే రోడ్డు ప్రమాదాల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఫలితంగా వారి కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగులుతోంది. తాజాగా తెలంగాణలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. వారంతా ఎంతో సంతోషంగా, భక్తిగా మేడారం జాతరకు వెళ్లి వనదేవతలను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకుని తిరిగి కారులో పయనమయ్యారు.

'The Great CM Yogi': దటీజ్ యోగీ, నిరసనకారులు ఏడుస్తున్నారు, ప్రభుత్వ నిర్ణయంతో షాకవుతున్నారు, ట్వీట్ చేసిన యోగీ ప్రభుత్వ కార్యాలయం, మానవ హక్కుల ఉల్లంఘనపై వివరణ ఇవ్వండి, యూపీ పోలీస్ చీఫ్‌కు నోటీసులు జారీ చేసిన మానవ హక్కుల కమిషన్

మేడారం జాతరకు వెళ్లి వస్తుండగా విషాదం నెలకొంది. ములుగు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కొంతమంది కారులో మేడారం జాతరకు వెళ్లారు. జాతరకు వెళ్లి తిరిగి కారులో వస్తున్నారు. మార్గంమధ్యలో గట్టమ్మ గుడి సమీపంలో ఆర్టీసీ బస్సు.. కారును బలంగా ఢీకొట్టింది. దీంతో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది.