Constitution Not KCR's Property: కేసీఆర్ కొత్త రాజ్యాంగం వ్యాఖ్యలు, రాజ్యాంగాన్ని కాదు.. నిన్నే మార్చాలంటూ సీఎంపై దళిత సంఘాల నేతలు మండిపాటు, యావత్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీఎస్పీ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్

దేశ రాజ్యాంగాన్ని మార్చాలని, కొత్త రాజ్యాంగం కోసం తాను ప్రతిపాదిస్తున్నట్లు సీఎం కేసీఆర్​ చేసిన కామెంట్లపై నిరసనలు (Constitution Not KCR's Property) వెల్లువెత్తుతున్నాయి. బుధవారం ఎక్కడికక్కడ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి

Telangana BSP chief coordinator RS Praveen Kumar (Photo: ANI)

Hyderabad, February 2: దేశ రాజ్యాంగాన్ని మార్చాలని, కొత్త రాజ్యాంగం కోసం తాను ప్రతిపాదిస్తున్నట్లు సీఎం కేసీఆర్​ చేసిన కామెంట్లపై నిరసనలు (Constitution Not KCR's Property) వెల్లువెత్తుతున్నాయి. బుధవారం ఎక్కడికక్కడ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ‘‘రాజ్యాంగాన్ని కాదు.. నిన్నే మార్చాలి” అంటూ సీఎంపై మండిపడ్డాయి. తాజాగా భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీఎస్పీ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ (BSP Leader RS Praveen Kumar) మండిపడ్డారు.

కేసీఆర్ (Telangana CM K Chandrashekar Rao) లాంటి మూర్ఖపు నాయకుల నుండి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆరే రాజ్యంగంపై (New Constitution of India' Remark) చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉన్నాయన్నారు. ఎంతో మంది మహనీయుల త్యాగాలతో రాజ్యాంగ రూపొందించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆస్తులు , కమిషన్లు పెంచుకునేందుకే రాజ్యాంగాన్ని మార్చలనుకుంటున్నారా? అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కారణంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పడి , ఆయన ముఖ్యమంత్రి అయిన విషయాన్ని మరిచిపోయారన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ యావత్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉదృతం చేస్తామన్నారు ప్రవీణ్ కుమార్. భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 3 వల్లనే తెలంగాణ ఏర్పడిందన్నారు. ఎందుకు భారత రాజ్యాంగాన్ని మార్చాలో దేశ ప్రజలకు కేసీఆర్ చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ అనర్హుడు అంటూ ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం లో లక్ష 15 వేల కోట్ల రూపాయలు ఒకటే కంపెనీకి ఇచ్చి తిరిగి దొడ్డిదారిన కేసీఆర్ సంపాదిస్తున్నాడని విమర్శించారు.

బీజేపీని బంగాళాఖాతంలో కలిపేస్తాం, ఆయన బట్టలు మారిస్తే దేశం బాగుపడుతుందా, దేశానికి కొత్త రాజ్యాంగం కావాలి, కేంద్ర బడ్జెట్ 2022పై మండిపడిన తెలంగాణ సీఎం కేసీఆర్

ఒక IAS ఇంట్లో ఒక కార్యక్రమానికి మెగా సంస్థ 50 లక్షల రూపాయలు ఇచ్చారని ప్రవీణ్ కుమార్ ఆరోపణలు చేశారు. కొన్ని జీవోలు రహస్యంగా తీసుకొస్తున్నారన్నారు. ప్రజల సొమ్ముతో కట్టిన ప్రగతిభావన్ కి ఎవరినీ రానివ్వడం లేదని విమర్శించారు. లక్షలాది ఎకరాల అసైన్డ్ భూములను లాక్కొని మీకు సంబంధించిన వాళ్ళకి కట్టబెట్టడానికా రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారు? అంటూ నిలదీశారు. బీజేపీ బాహాటంగా ముస్లింలను ఏరివేయలని ప్రకటించిందన్నారు. నిరంకుశ పాలన కొనసాగించడానికే రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారా? అంటూ కేసీఆర్ వైఖరిపై మండిపడ్డారు. రాజ్యాంగం పవిత్రమైనది... రాజ్యాంగాన్ని సవరించాల్సి వచ్చినపుడు చట్టసభల ద్వారా మారుస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలంతా ఏకమై రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నారు.

కేసీఆర్ బాధ్యతరహితమైన ప్రకటనలు మానుకొని అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. కేసీఆర్ క్షమాపణ చెప్పేవరకు రాష్ట్రవ్యాప్తంగా బీఎస్పీ తరపున ఆందోళనలు నిర్వహిస్తున్నామన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ లతో కేసీఆర్ మీటింగ్ పెడతా అంటున్నారు... దానికి తనను ఆహ్వానిస్తే అస్సలు వెళ్ళనన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

మొదటి నుంచి దళితులను కేసీఆర్​ మోసం చేస్తున్నారని, ఇప్పుడు రాజ్యాంగం మార్చాలంటూ కొత్త కుట్ర చేస్తున్నారని ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి. ఢిల్లీలోని తెలంగాణ భవన్​ వద్ద అంబేద్కర్​ విగ్రహానికి బీజేపీ నేతలు పాలాభిషేకం చేసి కేసీఆర్​ తీరుపై నిప్పులు చెరిగారు.గురువారం రాష్ట్రవ్యాప్తంగా ‘భీం దీక్షలు’ చేపట్టనున్నట్లు ప్రకటించారు. కామెంట్లను వెనక్కి తీసుకొని,ప్రజలకు క్షమాపణ చెప్పాలని సీఎంను పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి డిమాండ్​ చేశారు. గురువారం, శుక్రవారం 48 గంటలపాటు దీక్షలు చేపడుతామని, రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్​ విగ్రహాల ఎదుట కేసీఆర్​ దిష్టిబొమ్మలు దహనం చేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రజాసంఘాల నాయకులు అంబేద్కర్​ విగ్రహాల వద్దకు చేరుకొని కేసీఆర్​ మాటలను ఖండిస్తూ నినాదాలు చేశారు. ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు.

రాజ్యాంగం మార్చాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై చర్చకు సిద్ధంగా ఉన్నారా అని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ ప్రశ్నించారు. దేశంలో సమస్యలు పరిష్కారం కాకపోవటానికి రాజ్యాంగం కాదని... పాలకుల వైఫల్యమే కారణమన్నారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలకు రాజ్యాంగం అడ్డుగా ఉందన్న అక్కసుతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now