Telangana Lockdown: ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలి, మార్చి 31 వరకు తెలంగాణ లాక్‌‌డౌన్‌, అత్యవసర పనుల కోసమే బయటకు వెళ్లాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నూచన

మార్చి 31 వరకు తెలంగాణలో లాక్‌డౌన్‌ (Telangana Lock Down) ప్రకటించారు. కరోనా వైరస్‌ (COVID-19) వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశమనంతరం ప్రగతిభవన్లో మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ..ప్రధాని నరేంద్రమోదీ ( PM modi) ఇచ్చిన పిలుపుమేరకు జనతా కర్ఫ్యూలో పాల్గొని తెలంగాణ ప్రజలు దేశానికి ఆదర్శంగా నిలిచారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

telangana-will-be-lock-down-upto-march-31st-says-cm-kcr

Hyderabad, Mar 22: కరోనా వైరస్‌ (CoronaVirus) కట్టడిలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (Telangana CM KCR) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 31 వరకు తెలంగాణలో లాక్‌డౌన్‌ (Telangana Lock Down) ప్రకటించారు. కరోనా వైరస్‌ (COVID-19) వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

ప్రధాని మీద ట్రోల్ చేస్తే చర్యలు తప్పవు

ఈ సమావేశమనంతరం ప్రగతిభవన్లో మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ..ప్రధాని నరేంద్రమోదీ ( PM modi) ఇచ్చిన పిలుపుమేరకు జనతా కర్ఫ్యూలో పాల్గొని తెలంగాణ ప్రజలు దేశానికి ఆదర్శంగా నిలిచారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

చప్పట్లతో అద్భుతంగా సంఘీభావ సంకేతాన్ని, ఐక్యతను, విజ్ఞతను చాటిచెప్పిన తెలంగాణలోని ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. అత్యవసర పనులపై బయటకు వెళ్లినా మనిషికి, మనిషికి మధ్య 3 ఫీట్ల దూరం పాటించాలన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జనతా కర్ఫ్యూకు ప్రజలు స్పందించారు. దేన్నయిన ఎదుర్కోగలం అనే సంఘీభావం ప్రకటించారన్నారు.

కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

ప్రజలంతా ఇప్పటివరకు ఎలా క్రమశిక్షణతో ఉన్నారో..మార్చి 31వరకు ఇంటి దగ్గరే ఉండాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ఏ ప్రదేశంలో కూడా ఐదుగురికి మించి గుమికూడవద్దన్నారు. ఎవరి ఇండ్లకు వారు పరిమితం కావాలని సీఎం రాష్ట్ర ప్రజలకు సూచించారు.

తెలంగాణలో కరోనా కలవరం, 22కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ప్రజలకు నిత్యావసరవస్తువుల విషయంలో ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఇంటికి కావాల్సిన పాలు, కూరగాయలు, ఇతర సరుకులు తీసుకువచ్చేందుకు..ఆ ఇంటిలోని ఒక్క వ్యక్తికి మాత్రమే బయటకు వెళ్లే అనుమతివ్వడం జరుగుతుందని సీఎం పేర్కొన్నారు. ప్రజలు అత్యవసర పనుల కోసమే బయటకు వెళ్లాలని సూచించారు.

తెలుగు రాష్ట్రాల్లో సర్వం బంద్, సరిహద్దులు మూసివేత

అయితే అత్యవసర విభాగాలకు చెందిన ఉద్యోగులు 100 శాతం విధులకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. మిగిలిన విభాగాలకు చెందిన 20 శాతం ఉద్యోగులు విధులకు హాజరైతే సరిపోతుందని స్పష్టం చేశారు. పరీక్ష పేపర్ల వాల్యూయేషన్‌ కూడా వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు. టీచర్లు కూడా స్కూళ్లకు రానవసరం లేదన్నారు.

Here's Telangana CM KCR Speech

తెల్లరేషన్‌ కార్డుదారులందరికీ ప్రతీ ఇంట్లో ఒక్కొక్కరి 12 కిలోల చొప్పున నెలకు సరిపడా బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. బియ్యంతోపాటు ఇతర సరుకుల కొనుగోలు కోసం రూ.1500 నగదు అందజేస్తమన్నారు. మార్చి 31వరకు తెలంగాణవ్యాప్తంగా ప్రజా రవాణా బంద్‌ ఉంటుందని, ఆటోలు, బస్సులు, ప్రైవేట్‌ వాహనాలు బంద్‌ ఉంటాయన్నారు.

Here's KCR clapping hands at Pragathi Bhavan at 5 pm

కార్మికులు ఈ వారం రోజులు పాటు పనిచేయకున్నా యాజమాన్యం వేతనం ఇవ్వాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలను కూడా మూసివేస్తునట్టు చెప్పారు. గర్భిణీల జాబితాను సిద్ధం చేస్తున్నామని.. వారి డెలివరీలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. అత్యవసర వైద్య సేవలు కొనసాగుతాయని చెప్పారు.

అత్యవసరం కానీ శస్త్ర చికిత్సలు వాయిదా చేసుకోవాలని ప్రజలకు సూచించారు. మన వైద్యులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదేనని స్పష్టం చేశారు. మార్చి 31వరకు ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు అన్నీ బంద్‌ చేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణకు ఉన్న అంతరాష్ట్ర సరిహద్దులు మూసివేస్తున్నామని ప్రకటించారు. కేవలం అత్యవసర సరుకులు తెచ్చే గూడ్స్‌ వాహనాలకు మాత్రమే తెలంగాణలోకి అనుమతిస్తామని తెలిపారు.

ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా సిబ్బందికి మాత్రమే బయట తిరిగే అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. పెట్రోల్‌, ఎల్‌పీజీ గ్యాస్‌ సిబ్బందికి కూడా సేవలు అందించడానికి అనుమతిస్తున్నామని తెలిపారు. ఇటలీ కరోనా మహమ్మారి బారినపడి ప్రతి రోజు వందల మంది ప్రజలు చనిపోతున్నారని గుర్తుచేశారు. అలాంటి పరిస్థితులు రావొద్దంటే మనకు మనమే నియంత్రణ చేసుకోవాలని స్పష్టం చేశారు.

ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు జనతా కర్ఫ్యూలో భాగంగా..కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ఎంతో కృషి చేస్తోన్న వైద్య, పారిశుద్ధ్య, మీడియా సిబ్బందికి సంఘీభావం తెలుపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంభసభ్యులతో కలిసి చప్పట్లు కొట్టారు. సీఎం కేసీఆర్ దంపతులతోపాటు మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఈటల రాజేందర్, ఎంపీ సంతోష్ కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చప్పట్లు కొట్టి...వారందరికి సంఘీభావం ప్రకటించారు.