IPL Auction 2025 Live

COVID in TS: తెలంగాణలో కరోనా అలజడి, గురుకులంలో 43 మందికి పాజిటివ్, దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్‌కు గత మూడు రోజుల్లో 185 మంది ప్రయాణికులు, ఇందులో 11 మందికి కరోనా పాజిటివ్‌

ఏకంగా 43 మంది విద్యార్థులతో పాటు ఒక టీచర్ కరోనా బారిన పడ్డారు. ఈ గురుకుల పాఠశాలలో మొత్తం 491 మంది విద్యార్థులతో పాటు 27 మంది సిబ్బంది ఉన్నారు. మూడు రోజుల క్రితం ఓ విద్యార్థి అస్వస్థతకు గురి కాగా... వైద్య పరీక్షలు నిర్వహించారు.

Coronavirus outbreak in TS (Photo Credits: IANS)

Hyd, Nov 29: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలోని ముత్తంగి గురుకుల పాఠశాలలో ఒక్కసారిగా కరోనా కలకలం రేగింది. ఏకంగా 43 మంది విద్యార్థులతో పాటు ఒక టీచర్ కరోనా బారిన పడ్డారు. ఈ గురుకుల పాఠశాలలో మొత్తం 491 మంది విద్యార్థులతో పాటు 27 మంది సిబ్బంది ఉన్నారు. మూడు రోజుల క్రితం ఓ విద్యార్థి అస్వస్థతకు గురి కాగా... వైద్య పరీక్షలు నిర్వహించారు.

కొవిడ్ టెస్టులో సదరు విద్యార్థికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో నిన్న 261 మంది విద్యార్థులు, 43 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 44 మందికి పాజిటివ్ అని నిర్ధారణ (Telangana on alert after 43 students test positive) అయింది. కరోనా బారిన పడిన వారిని గురుకులంలోనే ( residential school) క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మిగిలిన విద్యార్థులు, సిబ్బందికి ఈరోజు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 22,356 కరోనా పరీక్షలు నిర్వహించగా, 135 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో 62 కొత్త కేసులు వెల్లడి కాగా, రంగారెడ్డి జిల్లాలో 11, కరీంనగర్ జిల్లాలో 10 కేసులు గుర్తించారు. అదే సమయంలో 144 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,75,614 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,68,090 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,535 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,989కి పెరిగింది.

హైదరాబాద్‌లో హోమో సెక్స్‌వల్‌ రేవ్ పార్టీ భగ్నం, పెద్ద మొత్తంలో మద్యం బాటిల్స్‌, కండోమ్ ప్యాకెట్ల, హుక్కు స్వాధీనం చేసుకున్న పోలీసులు, వరంగల్‌లో బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు బుకీలు అరెస్ట్

ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్‌కు గత మూడు రోజుల్లో 185 మంది ప్రయాణికులు వచ్చారనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నెల 25, 26, 27 తేదీల్లో వారంతా హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారని తెలుస్తోంది. అలాగే బోట్స్‌వానా నుంచి 16 మంది వచ్చారు. వీరితోపాటు కరోనా కొత్త వేరియెంట్‌ కేసులున్న 12 దేశాల నుంచి కూడా ప్రయాణికులు వచ్చారు. వచ్చినవారందరికీ ఆసుపత్రిలోని ప్రత్యేక బృందాలు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేశాయి. ఇందులో 11 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది.

ఒమిక్రాన్ వైరస్ లక్షణాలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒమిక్రాన్ కరోనా వేరియంట్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రపంచదేశాలు, మళ్లీ మాస్కులు ధరించాలని సూచన

అలాగే ప్రయాణికుల రక్త నమూనాలను సీసీఎంబీకి పంపినట్లు తెలిసింది. అక్కడ ఈ నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేస్తారు. ఆ పరీక్షలో అది ఏ వేరియంటో నిర్ధారిస్తారు. పాజిటివ్‌ వచ్చిన ప్రయాణికులను ఐసోలేషన్‌కు తరలించారు. ఈ మూడు రోజుల్లో 57 దేశాల ప్రయాణికులు వచ్చారు.