Hyd, Nov 29: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో కూకట్‌పల్లిలో రేవ్ పార్టీని ఎస్వోటీ పోలీసులు భగ్నం (Hyderabad police bust rave party) చేశారు. కూకట్‌పల్లి వివేక్‌నగర్‌లోని ఇంటిపై ఎస్వోటీ పోలీసులు దాడి చేసి 44 మంది యువకులతో పాటు ఇద్దరు హిజ్రాలని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని విచారణ నిమిత్తం కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కి (Kukatpally police station) తరలించారు.
వీరి వద్ద నుంచి పెద్ద మొత్తంలో మద్యం బాటిల్స్, కండోమ్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువకులంతా కలిసి ప్రతి వీకెండ్లో పార్టీ నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించించారు. పట్టుబడిన వారంతా కూడా హోమో సెక్స్‌వల్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ పార్టీని నిర్వహిస్తున్న ఆర్గనైజర్లు Rakesh Reddy, Mohammed Imran, Dayal Biswas లను కూకట్ పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముంబై కేంద్రంగా ఆన్‌లైన్ ద్వారా క్రికెట్, పేకాట బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు బుకీలను సోమవారం కేయూసీ పోలీసులు అరెస్టు చేసారు. వీరి నుంచి సుమారు 2కోట్ల 5లక్షల 14వేల రూపాయల నగదు, 7 సెల్ ఫోన్లు, వివిధ బ్యాంకులకు సంబంధించి 43 పాస్‌బుక్‌లు, ఏటీఎం కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను మీడియాకు వెల్లడించారు.
వారు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు మాడిశెట్టి ప్రసాద్ (40) కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ హఫీజ్ పేటలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోని రెడీమెడ్ బట్టల వ్యాపారం నిర్వహించుకోనేవాడు. నిందితుడు సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఇందుకోసం హఫీజ్ పేటలో మరికొద్ది మంది స్నేహితులతో కలిసి 2016 నుంచి క్రికెట్ బెట్టింగ్ ప్రారంభించాడు. ఈ క్రమంలోనే నిందితుడు ప్రసాద్‌కు ఆన్‌లైన్ ద్వారా మహారాష్ట్రకు చెందిన క్రికెట్, మూడు ముక్కల పేకాట బెట్టింగ్ నిర్వాహకుడు అభయ్‌తో పరిచయం అయింది. ఇద్దరు కలిసి బెట్టింగ్ దందాలకు పాల్పడే వారని సీపీ తెలిపారు.
ఈ బెట్టింగ్‌లో మోసపోయిన వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదుతో నిందితులపై కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు, హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసును పోలీసులు నమోదు చేసుకోని సెంట్రల్ జోన్ డిసిపి పుష్ప అధ్వర్యంలో కేయూసీ, సైబర్ క్రైం పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేసి నిందితులను గుర్తించామన్నారు.
నిందితుల్లో ఒకడైన అభయ్ బెట్టింగ్ ద్వారా వచ్చిన లాభాన్ని పంచుకోనేందుకుగా సోమవారం మరో నిందితుడు ప్రసాద్ ఇంటికి వచ్చినట్లుగా పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ఇన్‌స్పెక్టర్ జనార్ధన్ రెడ్డి తన సిబ్బందితో వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు బెట్టింగ్ ద్వారా వచ్చిన డబ్బుతో పాటు బ్యాంక్ పాసుబుక్కులు, ఏటీఎం కార్డులు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని సీపీ అభినందించారు.