Covid in Telangana: ఈటెల ఆఫీసులో కరోనా కలకలం, కోవిడ్‌తో డీఎస్‌ఐ అబ్బాస్ అలీ మృతి, తెలంగాణలో తాజాగా 2,123 మందికి కరోనా పాజిటివ్, 11 మంది మృతితో 1,025కి చేరుకున్న మరణాల సంఖ్య
ఈ మేరకు శనివారం ఉదయం ఆయన కరోనా బులెటిన్ (Covid in Telangana) విడుదల చేశారు. ఇప్పటి వరకు మొత్తం 24,34,409 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 1,69,169 కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కరోనాతో 11 మంది మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 1,025కి చేరింది.
Hyderabad, Sep 19: తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం 54,459 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,123 పాజిటివ్ కేసులు (New positive cases) నమోదైనట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఉదయం ఆయన కరోనా బులెటిన్ (Covid in Telangana) విడుదల చేశారు. ఇప్పటి వరకు మొత్తం 24,34,409 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 1,69,169 కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కరోనాతో 11 మంది మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 1,025కి చేరింది.
కరోనా (COVID-19) బారి నుంచి శుక్రవారం ఒక్క రోజే 2,151 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,37,508కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,636 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 24,070 మంది హోం లేదా వివిధ సంస్థల ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు.
తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మం త్రి ఈటెల రాజేందర్ (Etela Rajender) కార్యాలయంలో ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరిలో ఇద్దరు డ్రైవర్లు, మరో ఇద్దరు పీఏలు, ముగ్గురు గన్‌మెన్లు ఉన్నట్లు మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఈ నేపథ్యంలో తనకూ గురువారమే కరోనా నిర్ధారణ పరీక్ష చేశారని, ఆ పరీక్షలో నెగెటివ్ వచ్చిందన్నారు.
రెండ్రోజుల త ర్వాత మరోసారి పరీక్ష చేయించుకుంటానని ఆయన తెలిపారు. ఏడుగురికి కరోనా పాజిటివ్ రావడంతో మంత్రి కార్యాలయంలో కలకలం రేగింది. దీంతో బీఆర్కే భవన్‌లోని మంత్రి ఈటల కార్యాలయాన్ని పూర్తిగా శానిటైజ్ చేశారు. అయితే తనకు నెగెటివ్ వచ్చి నందున శనివారం బీఆర్కే భవన్‌లోని తన కార్యాలయానికి యథావిధిగా వస్తానని ఈటెల తెలిపారు.
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ పోలీసుస్టేషన్‌లో డిటెక్టివ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (డీఎస్‌ఐ)గా పనిచేస్తున్న అబ్బాస్ అలీ(57) కరోనాతో మృతి చెందారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం బొంపల్లికి చెందిన అబ్బాస్ అలీ 1984లో కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరారు. తర్వాత హెడ్ కానిస్టేబుల్‌గానూ రాణించాడు. ఎస్‌ఐగా ప్రమోషన్ వచ్చిన అనంతరం అంబర్ పేట్‌లో శిక్షణ పొంది 10 నెలల క్రితం మాదాపూర్ పీఎస్‌లో డీఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టారు.
గత మంగళవారం ఆయనకు నీరసంగా ఉండటంతో మాదాపూర్‌లోని మెడికోవర్ ఆస్పత్రిలో టెస్ట్ చేయగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో అదే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజుల వ్యవధిలోనే ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ రావడంతో పరిస్థితి విషమించి శుక్రవారం ఉదయం మృతి చెందారు.మాదాపూర్ పీఎస్‌లో ఇప్పటికే పలువురు సిబ్బందికి కరోనా సోకినా అందరూ కోలుకున్నారు.