Telangana COVID-19: కరోనా భయం ముగ్గుర్ని చంపేసింది, తెలంగాణలో తాజాగా 1897 కేసులు, రాష్ట్రంలో 84 వేలు దాటిన మొత్తం కేసుల సంఖ్య, 654కు పెరిగిన మొత్తం మరణాల సంఖ్య
ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 22,972 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1897 మందికి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య 84,544కు చేరింది. తాజాగా కరోనాతో 9 మంది మృతి (Coronavirus Deaths) చెందగా.. మరణాల సంఖ్య 654కు పెరిగింది. కోవిడ్ నుంచి కొత్తగా 1920 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 61,294 మంది పూర్తిగా కోలుకున్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 22,596 యాక్టివ్ కేసులు (Active coronavirus cases) ఉన్నాయి. 15,534 మంది హోం ,ఇతర ఐసోలేషన్ కేంద్రాల్లో ఉంటున్నారు.
Hyderabad, August 12: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1897 కరోనా పాజిటివ్ కేసులు (Telangana COVID-19) నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 22,972 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1897 మందికి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య 84,544కు చేరింది.
తాజాగా కరోనాతో 9 మంది మృతి (Coronavirus Deaths) చెందగా.. మరణాల సంఖ్య 654కు పెరిగింది. కోవిడ్ నుంచి కొత్తగా 1920 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 61,294 మంది పూర్తిగా కోలుకున్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 22,596 యాక్టివ్ కేసులు (Active coronavirus cases) ఉన్నాయి. 15,534 మంది హోం ,ఇతర ఐసోలేషన్ కేంద్రాల్లో ఉంటున్నారు. దేశంలో 16 లక్షలకు పైగా కరోనా పేషెంట్లు డిశ్చార్జ్, యాక్టివ్ కేసులు కేవలం 6,43,948 మాత్రమే, దేశంలో తాజాగా 60,963 మందికి కరోనా, 23,29,639 కి చేరిన కేసుల సంఖ్య
రికవరీ రేటు దేశంలో 69.79 శాతం ఉండగా, తెలంగాణలో 72.49 శాతంగా ఉంది. తెలంగాణలో ఇప్పటివరకు 6,65,847 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇది దేశ సగటుకు కంటే ఎక్కువ అని పేర్కొంది. అలాగే మరణాల రేటు 0.77 శాతంగా ఉందని వివరించింది. తాజాగా నిర్ధారణ అయిన కేసు అత్యధిక కేసులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 479 కేసులు ఉండగా, రంగారెడ్డిలో 162, సంగారెడ్డిలో 107 కేసులు అత్యధికంగా నిర్ధారణ అయ్యాయి.
Here's TS Corona Update
ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2741 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య సుమారుగా 50కి చేరుకుంది. యాక్టివ్ కేసులు 2416 ఉండగా... నల్గొండ జిల్లాలో 1434 పాజిటివ్ కేసులు.. సూర్యాపేట జిల్లాలో 887 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యాదాద్రి-భువనగిరి జిల్లాలో 420 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతోంది. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1781కి చేరింది. అలాగే కరోనా బారిన పడి 22 మంది మృత్యువాతపడ్డారు. అలాగే కరోనా నుంచి కోలుకుని 286మంది డిశ్చార్జ్ అవగా...ప్రస్తుతం 1473 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 14 నుంచి లాక్‌డౌన్ నిబంధనలో సడలింపు చేయనున్నారు. ఈనెల 14 నుంచి 21 వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్యాపార వాణిజ్య సంస్థల నిర్వహణకు అనుమతించారు. ఈ మేరకు చాంబర్ ఆఫ్ కామర్స్, అఖిలపక్షం నాయకులు నిర్ణయం తీసుకున్నారు. స్పుత్నిక్ వీ కోసం క్యూ కడుతున్న దేశాలు, రష్యా తొలి వ్యాక్సిన్ కోసం 20 దేశాల నుంచి బిలియన్ డోసుల కంటే ఎక్కువ ప్రీ ఆర్డర్లు, సెప్టెంబర్ నుంచి వ్యాక్సిన్ ఉత్పత్తి
ఇదిలా ఉంటే కరోనా భయంతో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు.పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల పీఎస్ పరిధిలోని షాపూర్ నగర్‌కు చెందిన అనంత్‌రెడ్డి భార్య సుజాత (45)కు రెండు రోజుల క్రితం జ్వరం వచ్చింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రిలో చూపించగా మామూలు జ్వరమేనని డాక్టర్ తెలిపారు. అప్పటి నుంచి తనకు కరోనా సోకిందని మదనపడుతూ ఉండేది. ఈ క్రమంలో 10వ తేదీ రాత్రి సుజాత భర్త నైట్ డ్యూటీకి వెళ్లగా బెడ్రూంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకుంది.
కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి (60) ఈ నెల 6న కరోనా పాజిటివ్‌తో మలక్‌పేట యశోద ఆస్పత్రిలో చేరాడు. కరోనా నుంచి కోలుకోగా మరో రెండ్రోజుల్లో డిశ్చార్జ్ కానున్నాడు. అయితే ఇంటికి వెళితే స్థానికులు ఏలా చూస్తారోనన్న ఆందోళనతో పాటు కరోనాపై టీవీల్లో వచ్చే వార్తలు చూసి మరింత భయానికి గురయ్యాడు. దీంతో పీపీఈ కిట్‌తో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన ఏలేటి ఆనంద్‌రెడ్డి తన భార్య హేమలతరెడ్డి (65)తో కలిసి హైదరాబాద్‌లోని జీడిమెట్లలో నివాసం ఉంటున్నారు. హేమలతరెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. టీవీలో వచ్చే కరోనా వార్తలను రోజూ చూసి చూసి భయంతో మానసికంగా కుంగిపోయి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎస్సారెస్పీ కాకతీయ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.