Covid in TS: తెలంగాణలో పెరుగుతున్న కేసులు, గత వారం 555 కేసులు నమోదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు
అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త కరోనా కేసులు నమోదు అవుతున్నా.. ఆస్పత్రుల్లో చేరికలు లేవని, మరణాల సంఖ్య కూడా సున్నాగా ఉందని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ( health director Dr G Srinivas Rao) చెప్తున్నారు.
Hyd, June 10: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య (Covid-19 situation) పెరుగుతున్నాయని.. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త కరోనా కేసులు నమోదు అవుతున్నా.. ఆస్పత్రుల్లో చేరికలు లేవని, మరణాల సంఖ్య కూడా సున్నాగా ఉందని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ( health director Dr G Srinivas Rao) చెప్తున్నారు. కేసుల పెరుగుదలపై ఆందోళన నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ తరపున శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో గత వారం 355 కేసులు నమోదు అయ్యాయి. ఈ వారంలో 555 కేసులు (Covid in TS) నమోదు అయ్యాయి. రాష్ట్రంలో సుమారు 56 శాతం కేసుల పెరుగుదల నమోదు అయ్యింది. అలాగే దేశంలో కేసుల సంఖ్య 66 శాతం పెరిగిందని డీహెచ్ వెల్లడించారు. ముంబైలో మళ్లీ మొదలైన కల్లోలం, దేశంలో కొత్తగా 7,584 మందికి కరోనా, గత 24 గంటల్లో 24 మంది మృతి, అత్యధికంగా మహారాష్ట్రలో 8,813 మందికి పాజిటివ్
కరోనా మొత్తం ఎలిమినేట్ కాలేదు. సబ్ వేరియెంట్స్ కొంత ఇబ్బంది పెడుతున్నాయి. వచ్చే డిసెంబర్ వరకు ఇలాగే ఉండే అవకాశం ఉంది. అయితే ఆందోళన అక్కర్లేదు. మాస్క్ ధరించాలి. జాగ్రత్తలు పాటించాలి. జ్వరం, తలనొప్పి, వాసన లేకపోతే కచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలి. జాగ్రత్తలు పాటించడం మరీ మంచిది. త్వరలో ఇంటింటికి వెళ్లి వ్యాక్సినేషన్ చేపట్టబోతున్నాం. 12-18 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ అందుబాటులోనే ఉందని తెలిపారాయన.