దేశంలో గురువారం 7240 కేసులు రికార్డవగా, శుక్రవారం మరో 7,584 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,32,05,106కు చేరాయి. ఇందులో 4,26,44,092 మంది డిశ్చార్జీ అయ్యారు. మరో 36,267 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మహమ్మారి వల్ల ఇప్పటివరకు 5,24,747 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో 24 మంది కరోనాకు బలవగా, 3,791 మంది కోలుకున్నారు.
కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో ఉన్నాయి. రాష్ట్రంలో 8,813 మందికి పాజిటివ్ వచ్చింది. కేరళలో 2193, ఢిల్లీలో 622, కర్ణాటకలో 471, హర్యానాలో 348 చొప్పున కేసులు నమోదయ్యాయి.కాగా, మొత్తం కేసుల్లో 0.08 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.70 శాతం, మరణాల రేటు 1.21 శాతం, రోజువారీ పాజిటివిటీ రేటు 2.26 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,94,76,42,992 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.
#COVID19 | India reports 7,584 fresh cases, 3,791 recoveries, and 24 deaths in the last 24 hours.
Total active cases are 36,267 pic.twitter.com/kwQIIy8K3s
— ANI (@ANI) June 10, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)