COVID-19 Telugu States: తెలుగు రాష్ట్రాల్లో కరోనా పంజా, తెలంగాణలో 700కు చేరిన కరోనా కేసులు, ఏపీలో 534కు చేరిన కోవిడ్ 19 పాజిటివ్ కేసులు

రెండు రాష్ట్రాల్లో రోజు రోజుకు అనూహ్యంగా కేసులు పెరుగుతున్నాయి. ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కేసులు సంఖ్య పెరుగుతుందే కాని తగ్గడం లేదు. ఒక్కరోజులోనే అనూహ్యంగా కొత్త కేసులు పెరిగిపోయాయి.

COVID-19 in India | PTI Image

Hyderabad, April 16: తెలుగు రాష్ట్రాల్లో కరోనా పంజా (COVID-19 in Telugu States) విసురుతోంది. రెండు రాష్ట్రాల్లో రోజు రోజుకు అనూహ్యంగా కేసులు పెరుగుతున్నాయి. ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కేసులు సంఖ్య పెరుగుతుందే కాని తగ్గడం లేదు. ఒక్కరోజులోనే అనూహ్యంగా కొత్త కేసులు పెరిగిపోయాయి.

ఇంగ్లీష్ మీడియం జీవోను కొట్టివేసిన హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) కొత్తగా మరో 9 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 534కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్‌ అధికారి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. బుధవారం సాయంత్రం 7 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు జరిగిన కరోనా నిర్దారణ పరీక్షల్లో.. కృష్ణా జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 3, పశ్చిమ గోదావరి జిల్లాలో 3 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 20 మంది డిశ్చార్జ్‌ కాగా, 14 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 500 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అత్యధికంగా గుంటూరులో 122, కర్నూలులో 113 కరోనా పాటిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదు.

Here's AP Corona Cases List

తెలంగాణలో (Telangana) కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గురువారం ఒక్కరోజే 50 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఇవాళ్టి కొత్త కేసులన్ని గ్రేటర్ పరిధిలోనే నమోదు అయినట్లు చెప్పారు. ఇప్పటివరకూ తెలంగాణ 700 కేసులు నమోదు కాగా, 18మంది మృతి చెందినట్లు మంత్రి ఈటెల తెలిపారు. ఇప్పటివరకూ కరోనా బారిన పడి కోలుకుని 186మంది డిశ్చార్జ్‌ అయ్యారని పేర్కొన్నారు. ఇవాళ 68మంది డిశ్చార్జ్‌ కాగా, ఎవరూ చనిపోలేదన్నారు.

Here's minister Eatala Rajender Press Meet

 

దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోయినా లాక్‌డౌన్‌పై మొదట ప్రకటన చేసింది తెలంగాణయేనని అన్నారు. పేదలను ఆదుకోవాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్దేశ్యమని, ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ప్రజలు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి. బ్యాంకుల దగ్గర జనాలు గుంపులు గుంపులుగా ఉంటున్నారు.

ఏపీ, తెలంగాణలో రెడ్, ఆరెంజ్ జోన్లు ఇవే, కరోనా హాట్‌ స్పాట్ జిల్లాలను ప్రకటించిన కేంద్రం

మీ అకౌంట్‌లో పడిన డబ్బులు ఎక్కడికీ పోవు. రోజు కొంతమందికి డబ్బులు ఇస్తారు. ప్రజలు సంయమనం పాటించాలి. ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించాలి. అయితే కొంతమంది సహకరించడం లేదు. అలాగే మర్కజ్‌ నుంచి వచ్చినవారు, వారిని కలిసిన వారు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif