Telangana High Court: తెలంగాణలో కరోనా పరీక్షల తీరుపై అసంతృప్తి వ్యక్తంచేసిన హైకోర్టు, జూన్ 4లోగా దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు

ఈ నేపథ్యంలో తెలంగాణలో (Coronavirus Teats) కరోనా పరీక్షల తీరుపై మరోసారి హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మృతదేహాలకు కరోనా పరీక్షలు అవసరం లేదన్న ఉత్తర్వులను హైకోర్టు (Telangana High Court) కొట్టివేసింది. వివిధ ఆస్పత్రుల్లో చనిపోయిన వారు ఏ కారణాలతో ప్రాణాలు వదిలారో తెలుసుకునేందుకు మృతదేహాలకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

High Court of Telangana | (Photo-ANI)

Hyderabad, May 27: గత కొన్ని రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ 19 ( COVID-19 in Telangana) మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్ళీ పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో (Coronavirus Teats) కరోనా పరీక్షల తీరుపై మరోసారి హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మృతదేహాలకు కరోనా పరీక్షలు అవసరం లేదన్న ఉత్తర్వులను హైకోర్టు (Telangana High Court) కొట్టివేసింది. వివిధ ఆస్పత్రుల్లో చనిపోయిన వారు ఏ కారణాలతో ప్రాణాలు వదిలారో తెలుసుకునేందుకు మృతదేహాలకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణలో కరోనా నియంత్రణపై గుడ్ న్యూస్, ఒక్క రోజే 120 మంది డిశ్చార్జ్, తాజాగా 71 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 1991కి చేరిన మొత్తం కేసుల సంఖ్య

కొవిడ్‌-19 పరీక్షలకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. కరోనా పరీక్షల కోసం మృతదేహాల నుంచి నమూనాలు సేకరించరాదని పేర్కొంటూ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను హైకోర్టు పక్కనపెట్టింది. మే 1 నుంచి 25 వరకు చేసిన కరోనా పరీక్షలు, రాష్ట్రానికి వచ్చిన వలస కార్మికులకు చేసిన పరీక్షలు, ఎంతమందిని క్వారంటైన్‌ చేశారు, జోన్ల మార్పిడికి కారణాలు ఏమిటి? వంటి అంశాలతో నివేదిక సమర్పించాలని సూచించింది. లక్షా యాభై వేలు దాటిన కరోనా కేసులు, మహారాష్ట్రలో యాభై వేలు దాటిన కోవిడ్-19 కేసుల సంఖ్య, దేశ వ్యాప్తంగా 4,337 మంది మృతి

హైరిస్క్ అవకాశాలున్నప్పటికీ పాజిటివ్ వచ్చిన వ్యక్తిని కలిసిన వారికి లక్షణాలు లేకపోయినా పరీక్షలు ఎందుకు చేయడం లేదని హైకోర్ట్ ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఎందుకు తక్కువ టెస్టులు చేస్తున్నారని (Low Virus Testing in TS) పరీక్షల వివరాలన్నీ సమర్పించాలని కోరింది. మిలియన్ జనాభాకు కేవలం 545 కరోనా టెస్టులు మాత్రమే చేశారని అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రానికి తిరిగి వస్తున్న వలస కార్మికులకు ఇప్పటి వరకు ఎన్ని టెస్ట్‌లు చేశారని హైకోర్టు ప్రశ్నించగా.. ఇప్పటివరకు 24వేల 443 మందికి పరీక్షలు నిర్వహించామని అడ్వకేట్ జనరల్ వివరించారు. ఏజీ వాదనలతో హైకోర్టు ఏకభవించలేదు. కరోనా పరీక్షలపై కేంద్రం రెండు సార్లు రాసిన లేఖలు సమర్పించడంతో పాటు కరోనా రక్షణ కిట్లు ఎన్ని ఆస్పత్రుల్లో ఎంత మంది వైద్య సిబ్బందికి ఇచ్చారో ప్రతి అంశానికి సంబంధించి వివరాలు జూన్‌ 4లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

నిర్మల్‌, సూర్యాపేటలో కరోనా పరీక్షలకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక నివేదికలు ఇవ్వాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశంలోనే లక్షకుపైగా మరణాలు సంభవించాయని, మన దేశంలో వైద్యరంగం ఇంకా అభివృద్ధి చెందలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు పరీక్షల సంఖ్యను పెంచాలని తెలిపింది.