COVID-19 in Telangana: తెలంగాణలో కరోనా నియంత్రణపై గుడ్ న్యూస్, ఒక్క రోజే 120 మంది డిశ్చార్జ్, తాజాగా 71 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 1991కి చేరిన మొత్తం కేసుల సంఖ్య
Coronavirus Cases in India (Photo Credits: PTI)

Hyderabad, May 27: దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో తెలంగాణలో (COVID-19 in Telangana) మంగళవారం ఒక్కరోజే 120 మంది కరోనా బాధితులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో వైరస్‌ నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 1284కు చేరింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 71 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1991కి చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 650గా ఉంది. ఈరోజు కరోనాతో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య (Coronavirus Death Toll) 57కి చేరుకుంది. లక్షా యాభై వేలు దాటిన కరోనా కేసులు, మహారాష్ట్రలో యాభై వేలు దాటిన కోవిడ్-19 కేసుల సంఖ్య, దేశ వ్యాప్తంగా 4,337 మంది మృతి

కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 38 మంది ఉన్నారు. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ఆరుగురు చొప్పున కరోనా బారినపడ్డారు. వలసకార్మికులు 12 మంది, విదేశాల నుంచి వచ్చినవారిలో నలుగురు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం రాత్రి హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు.

నారాయణపేటలో నాలుగు నెలల బాలుడు కరోనాకు గురయ్యాడు. ఈ నెల 14న ఆ బాలుడికి తొట్టెల వేడుక నిర్వహించగా, వివిధ గ్రామాల నుంచి బంధువులు హాజరయ్యారు ఆ తరువాత రెండు రోజులకే ఆ బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. తెలంగాణ వ్యాప్తంగా నేటివరకు ఒక్క పాజిటివ్‌ కేసు కూడా లేని జిల్లాలు 3 ఉన్నాయని, 14 రోజులుగా పాజిటివ్‌ కేసులు లేని జిల్లాలు 21 ఉన్నాయని ఆయన వెల్లడించారు.