Corona Treatment in Telangana: తెలంగాణలో ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా చికిత్స, ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ పేరిట అమలు కానున్న పథకం, కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ (Covid-19 treatment included in Aarogyasri ) తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ (ఏబీ)లో కరోనా చికిత్సను ఇప్పటికే చేర్చగా, ఏబీని రాష్ట్రంలోనూ అమలు చేస్తున్నారు. దీంతో ఇకపై ఈ పథకం ‘ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్’ పేరిట అమలు కానుంది.

CM KCR visits Gandhi Hospital (Photo-TS CMO)

Hyderabad, August 30: కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ (Covid-19 treatment included in Aarogyasri ) తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ (ఏబీ)లో కరోనా చికిత్సను ఇప్పటికే చేర్చగా, ఏబీని రాష్ట్రంలోనూ అమలు చేస్తున్నారు. దీంతో ఇకపై ఈ పథకం ‘ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్’ పేరిట అమలు కానుంది. కరోనా చికిత్సను మొత్తం 17 రకాలుగా విభజించగా, అందులో 14 రకాలకు ప్రభుత్వాసుపత్రులలో వైద్యం ( limited to govt. hospitals) అందిస్తారు. ఇందులో ‘అక్యూట్‌ ఫెబ్రైల్‌ ఇల్‌నెస్‌’.. ‘పైరెక్సియా ఆఫ్‌ అన్‌నోన్‌ ఆరిజిన్‌’.. ‘నిమోనియా’ లాంటివి ఉన్నాయి. క్రమంగా దీనిని ప్రైవేటు ఆసుపత్రులకూ విస్తరిస్తారు.

రాష్ట్రంలో ఇకనుంచి ‘ఆరోగ్యశ్రీ+ఆయుష్మాన్‌ భారత్‌’ పేరిట ఈ పథకం అమలవుతుంది. రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ రాకతో ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి వచ్చిన చికిత్సల సంఖ్య 1,668కి పెరిగింది. అయితే వీటిలో 642 చికిత్సలను (Covid-19 treatment ) ప్రస్తుతానికి ప్రభుత్వ వైద్యంలోనే కొనసాగించాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ ఆరోగ్యశ్రీ పరిధిలో కేవలం 50 పడకలున్న ఆసుపత్రులకు అనుమతి లభిస్తోంది.

కేరళలో కరోనా థర్డ్ వేవ్ ప్రకంపనలు, రోజూ భారీగా పెరుగుతున్న కేసులు, దేశంలో తాజాగా 42,909 మందికి కోవిడ్, కొత్తగా 380 మంది మృతి, ప్రస్తుతం 3,76,324 యాక్టివ్ కేసులు

ఆయుష్మాన్‌ భారత్‌ చేరికతో ఇకనుంచి 6 పడకలున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, 30 పడకలున్న సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి వచ్చేశాయి. 6 పడకలున్న ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ‘ఆరోగ్యశ్రీ+ఆయుష్మాన్‌ భారత్‌’ను అమలు చేయడానికి అవసరమైన మార్గదర్శకాలను రూపొందించాక, దీనిపై నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుందని వైద్యవర్గాలు పేర్కొన్నాయి.

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద 1026 చికిత్సలు ప్రస్తుతం అమలులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌ రెండింటి కింద కలిసిన చికిత్సలు 810 ఉన్నాయి. మిగిలిన 216 ఆరోగ్యశ్రీ చికిత్సలు ఆయుష్మాన్‌ భారత్‌లో లేవు. ఈ చికిత్సలను గతంలో మాదిరిగానే ఇప్పుడూ కొనసాగిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలో 77.10 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతుండగా.. ఏబీ పథకం పరిధిలోకి కేవలం 24 లక్షల కుటుంబాలు మాత్రమే వస్తాయి.

కరోనా నుంచి కోలుకున్నా ఏడాది తర్వాత మళ్లీ అవే లక్షణాలు, నీరసంగా ఉండటం, కండరాల బలహీనతలు వంటి సమస్యలు ఉన్నట్లు తెలిపిన తాజా అధ్యయనం, ది లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైన కథనం

దీన్ని అమలు చేయడం ద్వారా చికిత్సలకయ్యే వ్యయంలో 60 శాతం కేంద్రం భరిస్తుంది. మిగిలిన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఏబీ కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి సుమారు రూ.250 కోట్ల వరకూ నిధులు వచ్చే అవకాశాలున్నాయని వైద్యవర్గాలు చెప్పాయి. ఆరోగ్యశ్రీలో ఒక కుటుంబానికి ఏడాదికి గరిష్ఠంగా రూ.2 లక్షలు వర్తిస్తుంది. ఆయుష్మాన్‌ భారత్‌లో అన్ని చికిత్సలకూ రూ.5 లక్షల వరకూ గరిష్ఠ పరిమితి ఉంటుంది.

ఇప్పటివరకూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని 642 చికిత్సలు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. అతి సాధారణ జ్వరం, మలేరియా, డెంగీ, గన్యా వంటి విష జ్వరాలతో పాటు డయేరియా, అక్యూట్‌ గ్యాస్ట్రో ఎంటరైటిస్‌, వడదెబ్బ, పాముకాటు, కుక్కకాటు, నిమోనియా, సెప్టిక్‌ ఆర్థరైటిస్‌, పిల్లల్లో కారణం తెలియని కడుపునొప్పి, నెలలు నిండకుండానే పుట్టిన పిల్లల్లో రెటినోపతి జబ్బు వస్తే అందించే లేజర్‌ థెరపీ, హెచ్‌ఐవీ, దాని అనుబంధ సమస్యలు, రక్త మార్పిడి, ఆల్కహాలిక్‌ లివర్‌ డిసీజ్‌ వంటి జబ్బులకు ఉచిత చికిత్స లభిస్తుంది. మెంటల్‌ రిటార్డియేషన్‌, న్యూరాలజీ స్ట్రెస్‌ రిలేటెడ్‌ డిజార్డర్స్‌ వంటి మానసిక రుగ్మతలూ దీని పరిధిలోకి వస్తాయి.

ఇక్కడి ప్రజలు అవసరాల రీత్యా ఇతర రాష్ట్రాలకు వెళ్లిన సందర్భంలో అక్కడ అనారోగ్య సమస్య ఎదురైతే.. ‘ఆరోగ్యశ్రీ+ఆయుష్మాన్‌ భారత్‌’ కార్డు ద్వారా ఉచితంగా చికిత్స పొందవచ్చు. ఇతర రాష్ట్రాల వారూ ఇక్కడ చికిత్స చేయించుకోవచ్చు. తమ రోగులకు అయిన వైద్య ఖర్చులను ఆయా రాష్ట్రప్రభుత్వాలు చెల్లిస్తాయి. ఇకనుంచి ఆరోగ్యశ్రీ పరిధిలో ఆసుపత్రులు అనుసంధానం కావాలంటే జిల్లా స్థాయిలోనే అనుమతులు పొందవచ్చు. ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రులన్నీ ఆయుష్మాన్‌ భారత్‌ పరిధిలోకి చేరతాయని వైద్యవర్గాలు తెలిపాయి. ఇక మొత్తం 1,668 చికిత్సల్లో లేని జబ్బు ఎదురైతే ఆరోగ్యశ్రీ ముఖ్య కార్యనిర్వహణాధికారి అనుమతితో సంప్రదించాలి. ఈ తరహా చికిత్సలకు ఆరోగ్యశ్రీ ముఖ్య కార్యనిర్వహణాధికారి అనుమతితో గరిష్ఠంగా రూ.లక్ష వరకూ చెల్లిస్తారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now