New Delhi, August 30: దేశంలో ఆదివారం 45 వేలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా అవి 42 వేలకు (Coronavirus in India) తగ్గాయి. నిన్నటికంటే ఇది 4.7 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 42,909 పాజిటివ్ కేసులు (Coronavirus Cases in India) నమోదయ్యాయి. కొత్తగా 380 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాలు 4,38,210కు (Covid Deaths) చేరాయి. మరో 3,19,23,405 కోట్ల మంది కరోనా నుంచి కోలుకోగా, 3,76,324 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపింది.
కాగా, గత 24 గంటల్లో కొత్తగా 34,763 మంది కరోనా నుంచి బయటపడ్డారని తెలిపింది. ఇప్పటివరకు 63.43 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది. కాగా, దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 29,836 కేసులు ఒక్క కేరళలోనే ఉన్నాయి. ఆదివారం అక్కడ 31 వేలకు పైగా నమోదయ్యాయి. తాజాగా రాష్ట్రంలో 75 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. సెకండ్ వేవ్ కాస్త తగ్గి దేశం ఊపిరి పీల్చుకుంటున్న వేళ కేరళలో కేసులు మళ్లీ వేగంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన ఐదు రోజుల్లో రోజుకు సగటున 30 వేల కేసులు నమోదు అయ్యాయి. బక్రీద్ సందర్భంగా ఆంక్షలు సడలించినప్పటి నుంచి 20వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి.
దేశవ్యాప్తంగా రోజువారీ కేసుల్లో కేరళ నుంచే 60శాతం దాకా ఉంటున్నాయి. కేసులు తగ్గినా కొవిడ్ నిబంధనలు పాటించడం ఎంత అవసరమో కేరళలోని పరిస్థితులు తెలుపుతున్నాయి. కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతుండటంతో కేరళ రాష్ట్రం మళ్లీ ఆంక్షల బాట పట్టింది. రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. కేరళలో ఆదివారం 29,836 కేసులు నమోదయ్యాయి. కొత్తగా 75 మంది చనిపోయారు. కేసులు పెరగడంతో పాటు పాజిటివిటీ రేటు 20శాతానికి చేరడం వైరస్ వ్యాప్తి తీవ్రతను సూచిస్తున్నది.
కేరళ కేసులు మూడో వేవ్ ప్రారంభానికి సంకేతాలు కావొచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేరళ రాష్ట్రంలో కేసులు పెరగడానికి బక్రీద్, ఓనం పండుగలే కారణమని వైద్య నిపుణులు చెప్తున్నారు. పండుగల వేల ఆంక్షలు సడలించడంపై వారు ముందే విమర్శించారు