CM KCR Review Meeting: లాక్‌డౌన్, కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ అంశాలపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష, సమావేశానికి హాజరైన డీజీపీ,హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు
ఈ సమావేశానికి ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హాజరయ్యారు.
Hyderabad, May 24: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్, వ్యాక్సినేషన్‌పై సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష (CM KCR Review Meeting) జరుగుతోంది. ఈ సమావేశానికి ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హాజరయ్యారు.
ఇందులో కరోనా వ్యాక్సినేషన్ (Corona Vaccination) పాలసీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్ అమలు తదితర అంశాలపై చర్చించే అవకాశముంది. లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేసిన నేపథ్యంలో ఎదురవుతున్న సమస్యలపై సీఎం (CM KCR) అధికారులతో చర్చించనున్నట్లు సమాచారం.టీకా విషయంలో ప్రజల్లో తిరిగే ఫ్రంట్ లైన్ వారియర్లకే మొదట ప్రాధాన్యత ఇవ్వాలని యోచిస్తోంది. ఫ్రంట్ లైన్ వారియర్ల జాబితాలో జర్నలిస్టులు, గ్యాస్ బాయ్స్, కూరగాయల వ్యాపారులతో పాటు చిరు వ్యాపారులను ప్రభుత్వం చేర్చింది.
కాగా గత పది రోజుల నుంచి రాష్ర్టంలో టీకా పంపిణీ కార్యక్రమం ఆగిన విషయం తెలిసిందే. కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణలో ఈ నెల 12వ తేదీ నుంచి లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ను అధికారులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. మే 30వ తేదీ వరకు ఈ లాక్‌డౌన్ కొనసాగనుంది.
లాక్ డౌన్‌తో కేసుల సంఖ్య కొంతవరకు తగ్గినా ప్రస్తుతం తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వ్యాక్సినేషన్లను దిగుమతి చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గ్లోబల్ టెండర్లకు ఆహ్వానించింది. జూన్ మొదటి వారంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పెద్ద మొత్తంలో ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.