Coronavirus in TS: తెలంగాణలో రిస్క్ చాలా తక్కువ, తాజాగా 1,717 మందికి కరోనా, ఐదు మంది మృతితో 1,222 కి పెరిగిన మరణాల సంఖ్య, యాక్టివ్‌గా 25,713 కేసులు

దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,12,063కు చేరింది. కరోనా బారిన పడి మరో ఐదుగురు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 1,222 కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేశారు. గత 24 గంటల్లో వైరస్‌ బాధితుల్లో 2,103 కోలుకున్నారు.

Medical workers (Photo Credits: IANS)

Hyderabad, Oct 11: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,717 కొత్త కరోనా కేసులు (Coronavirus in TS) నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,12,063కు చేరింది. కరోనా బారిన పడి మరో ఐదుగురు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 1,222 కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేశారు. గత 24 గంటల్లో వైరస్‌ బాధితుల్లో 2,103 కోలుకున్నారు.

దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 1,85,128కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 25,713 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ( Coronavirus Telangana) కరోనా రోగుల రికవరీ రేటు 87.29 శాతంగా ఉంది. కాగా.. మొత్తం నమోదయిన కేసుల్లో మరణాల రేటు 0.57 శాతానికి తగ్గింది.

అయితే తెలంగాణలో కోవిడ్‌–19 కేసుల సంఖ్య పెరుగుతున్నా మరణాల సంఖ్య మాత్రం పెరగడం లేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రిస్క్‌ తక్కువగా ఉండడానికి ప్రధాన కారణం.. ఇక్కడ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తక్కువగా ఉండడమే. దేశంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి జాతీయ సగటు కంటే తెలంగాణ సగటు అతి తక్కువగా ఉంది’అని ముంబైలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాపులేషన్‌ సైన్సెస్‌ (ఐఐపీఎస్‌) నివేదిక వెల్లడించింది.

తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం, 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం

జూలై 2017 నుంచి జూన్‌ 2018 మధ్యకాలంలో దీర్ఘకాలిక వ్యాధులున్న వారి గణాంకాలను ఆధారం చేసుకుని రాష్ట్రాల వారీగా కోవిడ్‌–19 బారిన పడి కోలుకున్న.., మరణించిన వారి సంఖ్యను లెక్కిస్తూ ఐఐపీఎస్‌ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం ప్రకారం జాతీయ స్థాయిలో సగటున 9.38 శాతం గృహాలు రిస్క్‌ జాబితాలో ఉన్నాయి. ఇదే తెలంగాణ రాష్ట్రానికి వస్తే రిస్క్‌ కేవలం 6.12 శాతంగా ఉంది. దేశంలో అత్యధికంగా రిస్క్‌ ఉన్న గృహాలు కేరళలో (33.19 శాతంతో) ఉన్నట్టు ఆ అధ్యయనం తెలిపింది. ఆ తర్వాతి వరుసలో ఆంధ్రప్రదేశ్‌ 19.82 శాతం, గోవా 15.89 శాతం, పంజాబ్‌ 15.51 శాతం, హిమాచల్‌ప్రదేశ్‌ 14.49 శాతంతో రిస్క్‌ జాబితాలో ఉన్నాయి.

రిస్క్‌ జాబితాలో ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో తెలంగాణ రాష్ట్రం కింది నుంచి 11వ స్థానంలో ఉంది. తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్‌–19 మరణాల్లో దీర్ఘకాలిక వ్యాధులున్న వారు 55.04 శాతంగా ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మిగతా 44.96 శాతం మరణాల్లో అత్యధికులు సకాలంలో వైద్యం తీసుకోకపోవడం వల్లే చనిపోయినట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

వయసు రీత్యా పరిశీలిస్తే అరవై సంవత్సరాలు దాటిన వారిలో రిస్క్‌ ఎక్కువగా ఉన్నట్లు ఐఐపీఎస్‌ పరిశీలన చెబుతోంది. దీర్ఘకాలిక వ్యాధులున్న వారిలో అరవై ఏళ్లు దాటిన వారు 52.25 శాతం ఉండగా, 45 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్నవారు 40.82 శాతం ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో 15 నుంచి 44 సంవత్సరాల వారుండగా.. 15 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ల సంఖ్య అతి తక్కువగా ఉంది.



సంబంధిత వార్తలు

Bank Holidays in 2025: బ్యాంక్ సెలవుల జాబితా 2025 ఇదిగో, పండుగల నుండి జాతీయ సెలవులు వరకు బ్యాంక్ సెలవుల పూర్తి జాబితాను తెలుసుకోండి

Weather Forecast: నెల్లూరు జిల్లాకు అలర్ట్, బలహీనపడి అల్పపీడనంగా మారిన తీవ్ర అల్పపీడనం, ఏపీలో అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన

CM Revanth Reddy: తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు..సినీ పెద్దలతో తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా ఉండాలని సూచించిన తెలంగాణ సీఎం