Cyber Fraud: రైతు రుణ‌మాఫీని టార్గెట్ చేసిన సైబ‌ర్ నేర‌గాళ్లు, ఆ లింక్ క్లిక్ చేసి ఏకంగా రూ.4 ల‌క్ష‌లు కోల్పోయిన రైతు

నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం గంగసారం గ్రామంలో గుండేటి ముత్యం రెడ్డి అనే రైతును మోసపోయాడు. అతడి వాట్సాప్ కు వచ్చిన లింకును ఓపెన్ చేయగానే అతడి బ్యాంకు ఖాతా నుండి 4 లక్షల కట్ అయినట్టుగా మేసేజ్ వచ్చింది.

Cyberattack Representational Image (Photo Credits : Pixabay)

Hyderabad, July 18: తెలంగాణ ప్రభుత్వం రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ (Runamafi) చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రైతులకు సైబర్ ముప్పు పొంచి ఉంది. సైబర్ నేరగాళ్లు అన్నదాతలను టార్గెట్ చేశారు. సైబర్ ముప్పు (Cyber) నేపథ్యంలో రైతులను అలర్ట్ చేశారు సైబర్ సెక్యూరిటీ పోలీసులు. వారికి పలు కీలక సూచనలు చేశారు. సైబర్ క్రిమినల్స్ (Cyber Criminals).. బ్యాంకు పేరిట వాట్సాప్ ప్రొఫైల్ (WhatsApp profile) బ్యాంకు పేరు, బ్యాంకు లోగోతో వాట్సాప్‌కు APK ఫైల్స్ పంపిస్తున్నట్లు తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లో అలాంటి అనుమానాస్పద లింకులను (Suspicious) క్లిక్ చేయొద్దని పోలీసులు సూచించారు. ఈ ఫైల్ యాక్సెప్ట్ చేస్తే వ్యక్తిగత డేటా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లనుంది. అలా చేస్తే మన కాంటాక్స్ట్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి మెసేజ్ వెళ్తుందని పోలీసులు తెలిపారు. గూగుల్ పే, ఫోన్‌‍ పే, యూపీఐ అకౌంట్లను హ్యాక్ చేసి డబ్బు దోచేస్తారని పోలీసులు హెచ్చరించారు.

Harish Rao on Resignation: నేను రెడీ, నువ్వు రెడీనా, రాజీనామాపై హరీష్ రావు కీలక ప్రకటన, కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేయకుండా.. 

రైతులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు పంపించే లింక్స్ యాక్సెప్ట్ చేస్తే ఫోన్ వాళ్ళ కంట్రోల్ కి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. ఎవరైనా అలా డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే 1930కి ఫోన్ చేయాలని సూచించారు. పోలీసులు హెచ్చరించినట్లుగానే సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఓ రైతు ఖాతాల్లోని డబ్బు కొల్లగొట్టారు. పంట, కుటుంబ అవసరాల కోసం ఓ రైతు తన అకౌంట్ లోదాచుకున్న డబ్బు లూటీ చేశారు కేటుగాళ్లు. నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం గంగసారం గ్రామంలో గుండేటి ముత్యం రెడ్డి అనే రైతును మోసపోయాడు. అతడి వాట్సాప్ కు వచ్చిన లింకును ఓపెన్ చేయగానే అతడి బ్యాంకు ఖాతా నుండి 4 లక్షల కట్ అయినట్టుగా మేసేజ్ వచ్చింది. దీంతో బాధిత రైతు లబోదిబోమన్నాడు. గుర్తు తెలియని నెంబర్ నుండి బ్యాంకు లోగోతో వచ్చిన లింకును ఓపెన్ చేయగా 4.16 లక్షల రూపాయలు పోయాయని బాధితుడు వాపోయాడు.

కాగా, రాష్ట్రంలో తొలి విడతలో లక్ష రూపాయల లోపు రుణాలు మాఫీ అయ్యాయి. 11 లక్షల మంది రైతులకు దాదాపు 6 వేల కోట్ల నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. నేరుగా రైతుల ఖాతాల్లోనే ఈ నిధులు జమ చేసింది. సాయంత్రం 4 తర్వాత అర్హులైన రైతుల ఫోన్లకు మాఫీ మెసేజ్‌లు వెళ్లాయి.