15 DSPs Transferred in TS: తెలంగాణలో 15 మంది డీఎస్పీలు బదిలీ, ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రగతి భవన్‌లో నేడు సీఎం కేసీఆర్ కీలక సమావేశం
మొత్తం 15 మంది డీఎస్పీలు బదిలీ (15 DSPs Transferred in TS) అయ్యారు. డీఎస్పీలను బదిలీలు చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి (DGP Mahender reddy) శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
Hyderabad, Nov 15: తెలంగాణలో డీఎస్పీల బదిలీ జరిగింది. మొత్తం 15 మంది డీఎస్పీలు బదిలీ (15 DSPs Transferred in TS) అయ్యారు. డీఎస్పీలను బదిలీలు చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి (DGP Mahender reddy) శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాచిగూడ, బంజారాహిల్స్, సంగారెడ్డి, ఎల్బీనగర్, పఠాన్ చెరు, పంజాగుట్ట, సిద్దిపేట, శంషాబాద్, బాన్సువాడకు కొత్త డీఎస్పీలను కేటాయించారు. ఇంటిలిజెన్స్ డీఎస్పీకి కూడా స్థాన చలనం లభించింది.
బదిలీ అయిన వారి వివరాలను ఓ సారి పరిశీలిస్తే.. కాచిగూడ ఏసీపీగా ఆకుల శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీగా సుదర్శన్, సంగారెడ్డి డీఎస్పీగా బాలాజీ, ఎల్బీనగర్ డీఎస్పీగా శ్రీధర్ రెడ్డి, పఠాన్ చెరువు డీఎస్పీగా భీం రెడ్డి, పంజాగుట్ట ఏసీపీగా గణేష్సిద్దిపేట ఏసీపీగా రామేశ్వర్, శంషాబాద్ ఏసీపీగా భాస్కర్, బాన్సువాడ డీఎస్పీగా జైపాల్ రెడ్డి, ఇంటిలిజెన్స్ డీఎస్పీగా కె.శ్రీనివాస్ రావు బదిలీ అయ్యారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో కీలక సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో భాగంగా వ‌్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు. ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి సీఎస్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ధరణి’ పోర్టల్ ద్వారా వ్యవయసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని కేసీఆర్ సర్కార్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.
రెండు నెలలుగా నిలిచిపోయిన వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ఆగిపోయాయి. ఈ రోజు జరగనున్న ఈ సమావేశంలో వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్లు ప్రారంభించడానికి ఏం చేయాలి..? అనే అంశంపై అధికారులతో కేసీఆర్ చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే.. రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ను కలిసిన ఇదివరకే రిజిస్ట్రేషన్, స్టాంపుల విభాగం అధికారుల సంఘాలు కలిశాయి. ‘ధరణి’ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు అంతా సిద్ధంగా ఉందని.. మెరుగైన సేవలకు పూర్తి స్థాయిలో సహకరిస్తామన్న అధికారులు, సిబ్బంది వెల్లడించారు