Disproportionate Assets Case: ఆక్రమాస్తులు రూ. 50 కోట్లకు పైమాటే, మల్కాజ్‌గిరి ఏసీపీ నరసింహారెడ్డి నివాసంపై ఏసీబీ దాడులు, 20చోట్ల కొనసాగుతున్న తనిఖీలు
ఆదాయానికి మించి ఆస్తులు (Disproportionate assets case:) ఉన్నట్లు ఆరోపణలతో ఏసీబీ ఈ సోదాలు చేపట్టింది. కాగా నరసింహారెడ్డి (Malkajgiri ACP Y Narasimha Reddy) గతంలో ఉప్పల్ సీఐగా పని చేశారు. పలు భూ వివాదాలతో పాటు సెటిల్‌మెంట్లలో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో 20చోట్ల ఆయనకు సంబంధించిన ఆస్తులపై ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి.
Hyderabad, Sep 23: హైదరాబాద్ మల్కాజ్‌గిరి ఏసీపీ నరసింహారెడ్డి నివాసంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు (Disproportionate assets case:) ఉన్నట్లు ఆరోపణలతో ఏసీబీ ఈ సోదాలు చేపట్టింది. కాగా నరసింహారెడ్డి (Malkajgiri ACP Y Narasimha Reddy) గతంలో ఉప్పల్ సీఐగా పని చేశారు. పలు భూ వివాదాలతో పాటు సెటిల్‌మెంట్లలో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో 20చోట్ల ఆయనకు సంబంధించిన ఆస్తులపై ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి.
ఇక ఒకే సమయంలో ఏసీబీ అధికారులు 34 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లాలో మూడు చోట్ల, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో రెండు చోట్ల, ఏపీలోని అనంతపురంలో ఒక చోట అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. మాజీ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి అల్లుడు అయిన ఏసీపీ నరసింహారెడ్డి రూ.50 కోట్ల అక్రమాస్తులు సంపాదించినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు.
2008 నుంచి 2010 వరకు మియాపూర్‌లో సీఐగా పని చేసిన నరసింహారెడ్డి పలు భూవివాదాల్లో తలదూర్చి ఆస్తులు కూడబెట్టినట్లు తేల్చారు. ఉప్పల్, మల్కాజ్‌గిరిల్లోనూ భూవివాదాల్లో ఏసీపీ తలదూర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. సాయంత్రం వరకు ఏసీబీ సోదాలు జరిగే అవకాశం ఉంది.
ఏసీపీ నివాసంతో పాటు ఏపీ, తెలంగాణలోని ఆయన బంధువుల నివాసాల్లో ఏకకాలంలో 12 చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సోదాలు ఈ రోజు సాయంత్రం వరకు జరగనున్నట్లు తెలిసింది.
సికింద్రాబాద్ నివాసంలో భారీగా బంగారు, వెండి ఆభరణాలను అధికారులు గుర్తించారు. వాటితో పాటు భారీగా ఆస్తులు, ప్లాట్స్, వ్యవసాయ భూములు గుర్తించారు. ఈ ఆరోపణలు నిజమైతే అరెస్ట్ చేసి అవకాశం ఉందంటున్నారు అధికారులు.