ap-cm-ys-jagan-mohan-reddy-meets-union-minister-Gajendra Singh Shekhawat (Photo-ANI)

Amaravati, Sep 23: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో (AP CM YS Jagan Delhi Tour) భాగంగా రెండో రోజు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో సమావేశం అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన నిధులు విడుదల చేయాలని ఏపీ ముఖ్యమంత్రి ఈ సందర్భంగా షెకావత్‌కు (Gajendra Singh Shekhawat) విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు నిధులు త్వరితగతిన అందించాలని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ పర్యటకు రావాలని జలశక్తి మంత్రిని (Union Water Resources Minister) సీఎం జగన్‌ కోరగా, త్వరలోనే పోలవరం పర్యటనకు వస్తానని ఆయన హామీ ఇచ్చారు.పోలవరం ప్రాజెక్టుకు వెచ్చించిన రూ.4 వేల కోట్ల మేర రీయింబర్స్‌ చేయాలని, పునరావాస సాయం త్వరితగతిన అందించాలని ఈ సందర్భంగా సీఎం జగన్‌ కోరారు.

అలాగే ఈ సమావేశంలో గోదావరి-కావేరి నధుల అనుసంధానంపైన కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. నదుల అనుసంధానం అంశంపై రాష్ట్ర పర్యటనకు వెళ్లాలని టాస్క్‌ఫోర్స్‌ చైర్మన్‌ వేదిరే శ్రీరామ్‌కు జలశక్తి మంత్రి షెకావత్‌ సూచించనట్లు సమాచారం. సీఎం జగన్‌ (Andhra Pradesh CM YS Jagan Mohan Reddy) వెంట వైఎస్సార్‌ సీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్‌ రెడ్డి కూడా ఉన్నారు. కాగా 2021 డిసెంబర్‌ కల్లా పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భావిస్తోంది.

Here's ANI Tweet

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి సమావేశం అయి రాష్ట్ర అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు సమాచారం. అలాగే రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో సీఎం వైఎస్‌ జగన్‌ మంగళవారం సాయంత్రం హోం మంత్రి నివాసంలో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సాయంపై చర్చించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీటితోపాటు దిశ చట్టం, శాసన మండలి రద్దు.. చట్ట రూపు దాల్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరినట్టు ఆ వర్గాలు తెలిపాయి.