Amaravati, Sep 22: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఢిల్లీలో (CM YS Jagan Delhi Tour) మంగళవారం సాయంత్రం కలిశారు. ఈ భేటీలో రాష్ట్రాభివృద్ధి అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఏపీ సీఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, బాలశౌరి ఉన్నారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. ఈ రోజు రాత్రి సీఎం జగన్ (Chief Minister YS Jagan Mohan Reddy) ఢిల్లీలోనే బస చేస్తారు. బుధవారం ఉదయం బయల్దేరి నేరుగా తిరుపతి చేరుకుంటారు.
అక్కడతిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో (Srivari Brahmotsavam) పాల్గొని స్వామి ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి తిరుమలలోనే బస చేసి గురువారం కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి కర్ణాటక ప్రభుత్వం తిరుమలలో నిర్మించనున్న భవనానికి జరిగే భూమి పూజలో పాల్గొంటారు. కాగా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అజెండాగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన సాగుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి.
గుజరాత్‌లో మాదిరిగానే ఏపీలో కూడా ఫోరెన్సిక్ యూనివర్శిటీ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు ( Union Home Minister amit shah) విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాజ్యసభలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీ బిల్లుపై జరిగిన చర్చలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే తొలిసారిగా గుజరాత్‌లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీ ఏర్పాటును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన స్వాగతించారు. దేశంలో నేరాలు జరిగే తీరు, నేర దర్యాప్తు, నేరాల వెనుక కారణాలను విశ్లేషించడంలో ఇలాంటి యూనివర్శిటీ ప్రముఖ పాత్ర పోషించగలవని అన్నారు.
Here's Vijayasai Reddy V Tweet
ఆంధ్రప్రదేశ్‌లో ఫోరెన్సిక్ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని రాజ్యసభలో కేంద్ర హోం మంత్రికి విజ్ఞప్తి చేయడం జరిగింది.
Video Link: https://t.co/Vh3oSqzMbx pic.twitter.com/zyHRQG1dbl
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 22, 2020
అయితే నేరాలు కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం కానందున పోలీసుల నేర పరిశోధనలో సహకరించేందుకు దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఇలాంటి వర్శీటీ వలన ఫోరెన్సిక్ సైన్సెస్‌లో స్పెషలిస్టులు తయారవుతారని చెప్పారు. హైదరాబాద్‌లో అత్యంత అధునాతనమైన ఫోరెన్సిక్ లేబరేటరీ ఉన్నందున ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఫోరెన్సిక్ యూనివర్శిటీ ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలించాలని ఆయన కేంద్ర హోం మంత్రికి విజ్ఞప్తి చేశారు