
Amaravati, Sep 22: ఏపీలో అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయన్నుట్లు కేంద్ర ప్రభుత్వం (Nuclear Power Plant in AP) ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ వద్ద అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అమెరికాకు చెందిన వెస్టింగ్ హౌజ్ ఎలక్ట్రిక్ కంపెనీతో చర్చిస్తున్నట్లు తెలిపారు. 1,208 మెగావాట్ సామర్థ్యం కలిగిన 6 అణు రియాక్టర్లను ఏర్పాటు చేయనున్నారు. అన్ని రకాల అధ్యయనాల తర్వాతే కొవ్వాడ ప్రాంతాన్ని (kovvada atomic power plant) ఎంపిక చేసినట్లు తెలిపారు. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ సూచించిన అర్హతల ప్రకారమే కొవ్వాడ ఎంపిక జరిగిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుపై పార్లమెంట్ వేదికగా కేంద్రాన్ని ప్రశ్నించారు. దానికి సమాధానంగా కేంద్రం అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు ((Atomic power plant)) చేయనున్నట్లు తెలిపింది. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ వద్ద అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అమెరికాకు చెందిన “వెస్టింగ్ హౌజ్ ఎలక్ట్రిక్” కంపెనీతో చర్చిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది.
అన్ని రకాల అధ్యయనాల తర్వాతే కొవ్వాడ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ సూచించిన అర్హతల ప్రకారమే కొవ్వాడ ఎంపిక జరిగిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.